Money Saving Ideas: డబ్బును ఆదా చేయాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న డబ్బును ఆదా చేయలేకపోతున్నారు. అధికంగా ఖర్చులు చేయడం.. నెలసరి జీతాలు సరిపడక అప్పులు చేయడం..

  • Rajitha Chanti
  • Publish Date - 8:36 am, Mon, 12 April 21
Money Saving Ideas: డబ్బును ఆదా చేయాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
Money Saving Tips

ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్న డబ్బును ఆదా చేయలేకపోతున్నారు. అధికంగా ఖర్చులు చేయడం.. నెలసరి జీతాలు సరిపడక అప్పులు చేయడం.. ఈ సమస్యలతో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఇక డబ్బును ఆదా చేయాలని ప్రయత్నించిన అందుకు సరైన మార్గాలు తెలియక సతమతమవుతుంటారు. అయితే మీ డబ్బులు సరైన మార్గాలలో ఆదా చేయాడానికి కొన్ని రకాలు ప్లాన్స్ ఉన్నాయి. అవెంటో తెలుసుకుందామా.

1. బడ్జెట్‏ను సిద్దం చేసుకోండి..

మీ నెలవారీ బడ్జెట్‏ను ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇది మీ అనవసర ఖర్చులను నియంత్రించడానికి సరైన మార్గం. అలాగే మీరు కట్టాల్సిన బిల్లులన్ని సమయానికి చెల్లించండి. ఇలా చేయడం వలన ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సిన పని ఉండదు.

2. క్రెడిట్ కార్డ్ బకాయిలు..

మీ క్రెడిట్ కార్డ్ బకాయిలను ఆలస్యం చేయకుండా ఇన్ టైంలోనే చెల్లిండి. అలాగే అధిక వడ్డి వినియోగదారుల రుణాలను తిరిగి చెల్లించండి. సమయానికి వాటిని తిరిగి చెల్లించండి. ఇలా చేయడం వలన మానసిక ఒత్తిడి ఉండదు. అలాగే డబ్బును గురించిన చింతా ఉండదు.

3. అత్యవసర బడ్జెట్..

మీ నెలవారీ సాలరీలో నుంచి కొంత డబ్బును అత్యవసర ఖర్చుల కోసం ముందుగానే పక్కన పెట్టుకోండి. మీ అత్యవసర బడ్జెట్‏లోని డబ్బు.. మీ ఆరు నెలల ఖర్చులకు సమానంగా ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వలన మనీ సెక్యూరిటీగా ఉండడమే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

4. అనవసర ఖర్చులను తగ్గించడం..

మీ అవసరాలను మించిన ఖర్చులను తగ్గించుకోండి.. మీకు కావాల్సిన వస్తువులు కొనడానికి మాత్రమే మీ డబ్బును వాడడం మంచిది. మీ వ్యక్తిగత బడ్జెట్‏లో కేవలం మీ అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. మీకు అవసరమైన వస్తువులు కొన్న తర్వాతే.. మిగతా వాటి గురించి ఆలోచించండి. ఇలా చేయడం వలన అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు.

5. ఆరోగ్య భీమా..

ఆరోగ్య భీమా ఉండడం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం కాలం ఆరోగ్య మీద మరింత శ్రద్ద అవసరం. అలాగే అనుకోని పరిస్థితుల్లో మీరు వ్యాధుల భారీన పడినప్పుడు మీకు ఈ భీమా వర్తిస్తుంది. ఆ సమయంలో మీర డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

6. టర్మ్ ఇన్సూరెన్స్..

మీకు పైనాన్షియల్ డిపెండెంట్లు కనుక ఉంటే మీకు తప్పనిసరిగా జీవిత భీమా ఉండాలి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మరణం సంభవించినప్పుడు మీ కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ జీవిత భీమా చేయాలనుకున్నప్పుడు సరైన టర్మ్ పాన్స్ ఎంచుకోవడం ఉత్తమం. ulipలు లేదా అలాంటి ఉత్పత్తులు భీమా, పెట్టుబడులను మిళితం చేసినప్పటికీ.. అవి చివరికి ఈ ప్రయోజనాలకు ఉపయోగపడవు.

7. త్వరగా పొదుపు చేయడం..

మీ పదవి విరమణ కంటే ముందుగానే పొదుపు పద్దతులను అవలంభించడం మంచిది. మీ ఉద్యోగ జీవితం ప్రారంభంలోనే ఈ పొదుపు పద్దతులను పాటించడం వలన మీ వృద్ధాప్య జీవితానికి ఆర్థికంగా మద్ధతు ఉంటుంది.

8. పెట్టుబడులను మర్చిపోకూడదు..

స్టాక్ మార్కెట్ల స్థితి మారుతున్న క్రమంలో చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తుంటారు. కానీ డబ్బును మరింత పెంచుకోవడానికి ఏకైక మార్గం పెట్టుబడి. కానీ ఇందులో దీర్ఘకాలిక పెట్టుబడి అవసరం. కాబట్టి స్టాక్ మార్కెట్స్ ఆకస్మిక పెరిగినప్పుడు మీరు అధిక పెట్టుబడి ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

9. హోం లోన్: 

గృహ రుణ సహయంతో ఇల్లు కొనడం అనేది.. అతి పెద్ద ఆర్థిక నిర్ణయం. మీరు ఎంతవరకు చెల్లించగలుగుతామనుకుంటే కేవలం అంతవరకు మాత్రమే లోన్ తీసుకోవడం ఉత్తమం. మీ హోంలోన్ యొక్క EMI మీ నెలవారీ ఆదాయంలో 30 శాతానికి మించకూడదు.

10. SIPలు పెట్టుబడి..

ఒక క్రమబద్దమైన పెట్టుబడి ప్రణాలిక (SIP) సరైన పెట్టుబడి పద్ధతులను సూచిస్తుంది. కార్పస్‏ను సృష్టించడానికి కొంత సమయంలో చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడానికి SIP సులువైన మార్గం. ఈ పద్ధతి ద్వారా చాలా కాలం పాటు పెట్టుబడులను కొనసాగేలా చేస్తుంది. అలాగే మీ కొనుగోలు ఖర్చులను క్రమంగా నియంత్రిస్తుంది. అలాగే మార్కెట్ హెచ్చు తగ్గులు రెండింటిలోనూ పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుంది.

Also Read: Akkineni Naga Chaitanya: ఇక్కడ సినిమా పూర్తిచేసుకున్న ‘థ్యాంక్యు’.. ఇటలికి పయనమైన నాగచైతన్య…