Fenugreek Seeds : మెంతి నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు..! ఈ 7 సమస్యలకు చక్కటి పరిష్కారం..
Fenugreek Seeds : మెంతి గింజలను సాధారణంగా ఆహారంలో ఉపయోగిస్తారు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు
Fenugreek Seeds : మెంతి గింజలను సాధారణంగా ఆహారంలో ఉపయోగిస్తారు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మెంతి గింజలు మీ చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి. ప్రతి రోజు మీరు మెంతి నీటిని తాగవచ్చు. దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. బాణలిలో మెంతి గింజలను సన్నని మంటపై వేయించాలి. ఇప్పుడు ఈ విత్తనాలను గ్లైండర్‌లో వేసి చక్కగా పొడి చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ మెంతి పొడి వేసి కలపాలి. ప్రతిరోజు ఉదయం తాగితే మంచి ప్రయోజనాలుంటాయి.
1. మెంతి నీరు తాగడం వల్ల మీ కడుపు నిండుగా ఉంటుంది. మెంతిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. మీరు కడుపు నిండితే ఎక్కువగా తినరు. అటువంటి పరిస్థితిలో అనారోగ్యకరమైన స్నాక్స్ జోలికి వెళ్లరు. ఇది ఉబ్బరం నివారించడానికి సహాయపడుతుంది. 2. మెంతి గింజల్లో జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలు ఉంటాయి. ఇది జుట్టు మందంగా కావడానికి, చుండ్రు సమస్యలను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. 3. మెంతి నీరు మీ శరీరం నుంచి హానికరమైన విష పదార్థాలను బయటకు తీయడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో పోరాడటానికి ఉపయోగపడుతుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది. 4. మెంతి విత్తనాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఔషధంగా చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో మెంతులు సహాయపడతాయి. మెంతి గింజల్లో అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. 5. మెంతుల వినియోగం మూత్రపిండాలలో రాళ్ల చికిత్సకు సహాయపడుతుంది. మెంతి గింజలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.