Wine Shop Voting: ఆ కాలనీవాసుల రూటే సపరేటు.. వైన్స్ షాప్ కోసం ఓటింగ్.. ఎక్కడో ఎందుకో తెలుసా?

జనావాసాల మధ్య ఉన్న దుకాణాన్ని తొలగించాలంటూ అబ్కారీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నివించుకున్న ఫలితం లేకుండా పోవడంతో చేసేదీలేక, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు కాలనీ వాసులు.

Wine Shop Voting: ఆ కాలనీవాసుల రూటే సపరేటు.. వైన్స్ షాప్ కోసం ఓటింగ్.. ఎక్కడో ఎందుకో తెలుసా?
Wines
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 15, 2022 | 7:20 AM

Wine Shop Voting: ఇప్పటివరకు నాయకులను ఎన్నుకునేందుకు ఓట్లు వేయడం చూశాం. కాని అక్కడ మాత్రం వైన్ షాప్‌ను తొలగించేందుకు ఎన్నిక నిర్వహించారు. జనావాసాల మధ్య ఉన్న దుకాణాన్ని తొలగించాలంటూ అబ్కారీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నివించుకున్న ఫలితం లేకుండా పోవడంతో చేసేదీలేక, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు కాలనీ వాసులు. మద్యం దుకాణం మకొద్దు అంటూ ఏకంగా ఓటింగ్ నిర్వహించార.

సాధారణంగా ఎన్నికలు ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు నిర్వహిస్తారు. కాని హైదరాబాద్ లోని బేగంపేట గురుమూర్తిలేన్‌ ప్రాంతంలో మాత్రం వైన్‌ షాప్‌ ఉండాలా? వద్దా? అనే విషయంపై వినూత్నంగా ఓటింగ్‌ జరిపారు. వైన్ షాపు కు వ్యతిరేకంగా.. 95 శాతం పైగా ఓటింగ్ వేయగా.. 3.58 శాతం మంది కావాలని ఓట్ వేశారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పర్సెప్షన్‌ స్టడీస్‌కు అనుబంధం సంస్థ అయిన ‘హక్కు ఇన్షియేటివ్‌ అండ్‌ ఛానల్‌’ ను ఈ ఓటింగ్ జరపాలని స్థానికులు ఆశ్రయించారు. కాలనీ వాసుల కోరిక మేరకు సంస్థ శనివారం సిటిజన్‌ రెఫరెండమ్‌ పేరుతో గుర్తిమూర్తి లేన్‌ కు 500 మీటర్ల పరిధిలో ఓటింగ్‌ నిర్వహించారు.

గత దివారం కౌంటింగ్‌ జరిగింది. ఏరియాలో వైన్‌ షాపులు ఉండడం ఇష్టమేనా?’ అనే ప్రశ్నకు ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. ఈ ఎన్నికలో 1,479 మంది ఓటు వేయగా.. 1,415 మంది వద్దని.. 53 మంది కావాలన్నారు. ఇక, ఈ ఎన్నికలో కూడా 11 ఓట్లు చెల్లలేదు. ఓట్లు వేసేందుకు 737 మంది మహిళలు, 742 మంది పురుషులు పాల్గొన్నారు. హక్కు ఇన్షియేటివ్‌ అండ్‌ ఛానల్‌’ సంస్థ నిర్వహించిన ఈ ఓటింగ్‌ ఫలితాల రిజల్ట్ ను పరిగణలోకి వైన్ షాప్ తొలగించాలంటూ కాలనీ వాసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే గతంలో ఇదే సంస్థ సికింద్రాబాద్‌ లో వైన్ షాపుల తొలగింపుపై సర్వే చేసింది. ఇప్పుడు రెండోసారి అదే విషయంపై ఓటింగ్ జరిపింది. ఢిల్లీలో కూడా వైన్‌షాపుల ఏర్పాటుపై ఈ సంస్థ సర్వేలు చేసింది. కాగా, వైన్‌ షాపును అక్కడి నుంచి తరలించే వరకు పోరాడుతామని కాలనీ వాసులు చెబుతున్నారు.

Read Also….  Multibagger Stock: రూ.10 వేలు పెట్టుబడి పెడితే రూ. 2.43 లక్షలు.. అది సంవత్సరంలోనే.. కాసులు కురిపించిన స్టాక్..