Multibagger Stock: రూ.10 వేలు పెట్టుబడి పెడితే రూ. 2.43 లక్షలు.. అది సంవత్సరంలోనే.. కాసులు కురిపించిన స్టాక్..

స్టాక్ మార్కెట్‌లో పెట్టబడితో కోట్లు సంపాదించవచ్చని చెబుతారు. కోట్ల రాబట్టాలంటే మల్టీ బ్యాగర్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలంటారు..

Multibagger Stock: రూ.10 వేలు పెట్టుబడి పెడితే రూ. 2.43 లక్షలు.. అది సంవత్సరంలోనే.. కాసులు కురిపించిన స్టాక్..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 15, 2022 | 7:15 AM

స్టాక్ మార్కెట్‌లో పెట్టబడితో కోట్లు సంపాదించవచ్చని చెబుతారు. కోట్ల రాబట్టాలంటే మల్టీ బ్యాగర్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలంటారు. అలాంటి స్టాక్ బ్రైట్‌కామ్ గ్రూప్. ఈ బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లు గత ఏడాదిలో 2,320 శాతం పెరిగింది. ఫిబ్రవరి 12, 2021న రూ.6.17 వద్ద ముగిసిన పెన్నీ స్టాక్ ఈరోజు BSEలో రూ.150.10కి చేరుకుంది. బ్రైట్‌కామ్ గ్రూప్ షేర్లలో ఏడాది క్రితం పెట్టుబడి పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.24.23 లక్షలు అయింది.

ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.15,608 కోట్లుగా ఉంది. అయితే, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు 16.31% నష్టపోయింది. ఈ స్టాక్ డిసెంబర్ 24, 2021న 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.204.80కి చేరగా, మే 5, 2021న 52 వారాల కనిష్ట స్థాయి రూ.5.82కి చేరింది. 15 మంది ప్రమోటర్లు సంస్థలో 19.74 శాతం వాటాను కలిగి ఉన్నారు. పబ్లిక్ వాటాదారులు 80.26 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2,11,987 పబ్లిక్ వాటాదారులు 94.83 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు.

వీరిలో 2.08 లక్షల మంది వాటాదారులు రూ. 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి 11.56% వాటాను కలిగి ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం Q3లో 68 మంది విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు)ఈ కంపెనీలో 11.55% వాటాను కలిగి ఉన్నారు. డిసెంబరు త్రైమాసికంలో, సంస్థ నికర లాభం 168% పెరిగి రూ. 371.45 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 138.60 కోట్లుగా ఉంది.

Note: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పూర్తిగా నష్టభయంతో కూడుకున్నది. మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ని గుర్తించడానికి చాలా నైపుణ్యం కావాలి. పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.

Read also.. Multibagger Stock: రూ.10 వేలు పెట్టుబడి పెడితే రూ. 2.43 లక్షలు.. కాసులు కురిపించిన మల్టీ బ్యాగర్ స్టాక్..