Woman IPS: అర్ధరాత్రి సైకిల్‌పై మహిళా అధికారిణి హల్‌చల్.. ఖంగుతిన్న పోలీసులు..!

అర్థరాత్రి సమయంలో ఓ మహిళ సైకిల్ తొక్కుకుంటూ తమిళనాడు రాజధాని చెన్నై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇదీ చూసిన పోలీసులు ఆమెను ఆపి వివరాలు ఆరా తీయడంతో.. వాళ్లనే తనిఖీలు చేసి వార్నింగ్ ఇచ్చారు.

Woman IPS: అర్ధరాత్రి సైకిల్‌పై మహిళా అధికారిణి హల్‌చల్.. ఖంగుతిన్న పోలీసులు..!
Woman Ips Officer Ramya Bharathi
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 26, 2022 | 9:48 AM

Woman IPS on Bicycle: అర్థరాత్రి సమయంలో ఓ మహిళ సైకిల్ తొక్కుకుంటూ తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నై(Chennai) వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇదీ చూసిన పోలీసులు ఆమెను ఆపి వివరాలు ఆరా తీయడంతో.. వాళ్లనే తనిఖీలు చేసి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే ద్రవిడనాట సంచలనంగా మారింది. ఆమె ఎవరో కాదు.. రమ్య భారతి IPS(Ramya Bharathi IPS) జాయింట్ కమిషనర్, చెన్నై నార్త్. నిన్నగాక మొన్న అర్ధరాత్రి ఒంటరిగా సైకిల్ తొక్కిన ఆమె ఉత్తర మండలం పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో తనిఖీలు చేశారు. ఐపీఎస్ అధికారిణి రమ్య భారతి సరిగ్గా తెల్లవారుజామున 2.45 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. వాలాజా రోడ్డు నుంచి ముత్తుసామి బ్రిడ్జి వరకు, ఎస్పాళ్లనేడ్ రోడ్డు, మింట్ స్ట్రీట్, మూలకొత్తలం ప్రాంతం మీదుగా వైతినాథన్ బ్రిడ్జి మీదుగా తాండయార్‌పేట పోలీస్ స్టేషన్ వరకు సైకిల్‌పై వెళ్లారు.

రాత్రిపూట సైకిల్‌పై పర్యటిస్తూ మహిళా ఐపీఎస్‌ అధికారి గస్తీ నిర్వహించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. 2008 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రమ్య భారతి.. గ్రేటర్‌ చెన్నై ఉత్తర మండల జాయింట్ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి చెన్నైలోని ఫ్లవర్‌ బజారు నుంచి చాకలిపేట వరకు సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. పోలీసులు విధులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. రోడ్లపై తిరుగుతున్న అనుమానితులను విచారించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ విషయం దుబాయ్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దృష్టికి వెళ్లింది. ట్విట్టర్‌ ద్వారా ఆమెకు అభినందనలు తెలిపారు.

ఫోర్ట్ పోలీస్ స్టేషన్, ఎస్పాళ్లనేడ్ పోలీస్ స్టేషన్, ఫ్లోరిస్ట్ పోలీస్ స్టేషన్, యానైక్కవుని పోలీస్ స్టేషన్, వాషర్‌మెన్‌పేట్ పోలీస్ స్టేషన్, ఆర్కే నగర్ పోలీస్ స్టేషన్, న్యూ వాషర్‌మెన్‌పేట్ పోలీస్ స్టేషన్, తండయార్‌పేట్ పోలీస్ స్టేషన్‌లతో సహా 8 పోలీస్ స్టేషన్లపై దాడులు నిర్వహించారు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో సైకిల్‌పై వెళ్లేటప్పుడు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు, రాత్రి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసులను విధులపై ఆరా తీశారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అవగాహన కల్పించేందుకు ఈ సైకిల్ యాత్ర చేసినట్లు రమ్య భారతి తెలిపారు. మహిళా ఐపీఎస్ అధికారిణి అర్ధరాత్రి సైకిల్ యాత్రలో తనిఖీ చేసిన ఘటన పోలీసు అధికారుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, చెన్నై నార్త్ జాయింట్ కమిషనర్ రమ్య భారతి చర్యపై పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సైతం ఐపీఎస్ రమ్య భారతిని అభినందించారు. మహిళలపై హింసను తగ్గించి, మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని డీజీపీ వారిని ఆదేశించారు. తమిళనాడు పోలీసు చట్టం.. శాంతిభద్రతలను కాపాడటంలో ఉక్కు పాదంతో వ్యవహరిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు.

Read Also… Ukraine Russia War: ఉక్రెయిన్‌లో యుద్ధం ముగించడానికి భారత్ చైనా అనుకూలం.. మాట్లాడేందుక సంసిద్ధత!