AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్ వేడెక్కితే ఏమవుతుంది? అప్పుడు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా..?

Smart Phone Heating: స్మార్ట్‌ఫోన్లు వేడెక్కడం సర్వసాధారణం. ఛార్జింగ్, గేమింగ్, బ్రౌజింగ్ వల్ల ఫోన్ వేడెక్కుతుంది, పనితీరు మందగిస్తుంది. వేడిని తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వేడెక్కిన ఫోన్‌ను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టకూడదో నిపుణులు వివరించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం .. ..

ఫోన్ వేడెక్కితే ఏమవుతుంది? అప్పుడు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా..?
Smartphone Overheating
Ram Naramaneni
|

Updated on: May 23, 2026 | 8:09 AM

Share

నేటి ఆధునిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అది మనకు సర్వస్వంగా మారినప్పటికీ, తరచుగా ఫోన్లు వేడెక్కడం అనేది చాలా మంది యూజర్లు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు, సుదీర్ఘ వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్‌ఫోన్లు వేడెక్కడం జరుగుతుంది. బయట అధిక ఉష్ణోగ్రతలు, ప్రత్యేకించి ఎండలో ఉన్నప్పుడు కూడా మన శరీరంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు ప్రభావితం అవుతాయి. ఫోన్ వేడెక్కినప్పుడు దాని పనితీరు మందగిస్తుంది, ఒక్కోసారి హ్యాంగ్ అవుతుంది. నిపుణులు ఈ సమస్యపై వివరణ ఇచ్చారు. ఫోన్‌లోని అన్ని ఆపరేషన్లను ప్రాసెసర్లు నిర్వహిస్తాయని, ఇవి స్వతహాగా వేడిని ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. బయటి ఉష్ణోగ్రతలకు తోడు ప్రాసెసర్ వేడి కూడా తోడైతే, ఫోన్ ఓవర్‌హీట్ కాకుండా ప్రాసెసర్ కొన్నిసార్లు స్తంభించిపోతుందని, దీనివల్ల ఫోన్ స్పీడ్ తగ్గిపోతుందని లేదా పూర్తిగా మొరాయించవచ్చని వివరించారు.

బ్యాటరీలను నిర్దిష్ట ఉష్ణోగ్రతల్లో పనిచేసేలా డిజైన్ చేస్తారు. వేడి పెరిగితే అవి మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది, దీనివల్ల బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుంది. ఎండలో ఉన్నప్పుడు ఫోన్ స్క్రీన్‌లో మార్పులు కనిపించినా, స్క్రీన్ బర్న్ అయినా దానికి వేడే కారణం కావచ్చు. పాత ఫోన్లపై వేడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. స్క్రీన్ ప్రొటెక్టర్లు కూడా వేడిని మరింత గ్రహిస్తాయి, ఇది ఫోన్‌కు మంచిది కాదు. స్మార్ట్‌ఫోన్‌ను వేడి నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బయట వేడిగా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టడం మానుకోవాలి, ఒకవేళ పెట్టినా ఎక్కువసేపు అలా వదిలేయకూడదు. కారులో లేదా ఇంట్లో సూర్యరశ్మి నేరుగా పడే చోట ఫోన్‌ను ఉంచకూడదు. వీలైనంత వరకు నీడలో, చల్లటి ప్రదేశంలో ఉంచాలి. ఫ్యాన్‌కు ఎదురుగా లేదా ఏసీ ఉన్న గదిలో పెట్టుకోవడం మంచిది. ఫోన్ తేలికగా పనిచేసేలా చూసుకోవాలి. అంటే, నిరంతరం ఉపయోగించని జీపీఎస్ వంటి అప్లికేషన్లను క్లోజ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో తక్కువ అప్లికేషన్లు రన్ అయితే ఫోన్ అంత చక్కగా పనిచేస్తుంది. ఫోన్ వేడెక్కినప్పుడు దానిపై ఉన్న కేసులను కాసేపు తొలగించడం వల్ల కూడా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఫోన్‌ను తక్కువగా ఉపయోగిస్తే పనితీరు మెరుగుపడుతుంది. మరీ స్లో అయినా లేదా హ్యాంగ్ అయినా, కొద్దిసేపు స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ప్రతిరోజూ అర్థరాత్రి సమయంలో కొంతసేపు ఫోన్ ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అయ్యి, ఆన్ అయ్యేలా షెడ్యూల్ సెట్ చేసుకోవచ్చు.

కొంతమంది ఫోన్ వేడెక్కగానే ఐస్ ప్యాక్‌ల మధ్య లేదా ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, పైగా అది ఫోన్‌కు హానికరం. వేడి ఫోన్‌ను ఒక్కసారిగా చల్లటి ప్రదేశంలో పెట్టడం వల్ల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతాయి, ఇది ఫోన్ భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అంతేకాదు, దీనివల్ల ఫోన్‌లోకి నీరు వెళ్లిపోయి ప్రమాదం కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లలో పెరిగిన ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి అంతర్నిర్మిత ఓవర్‌హీట్ వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలు మరీ విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మాత్రమే దెబ్బతింటాయి కాబట్టి, సహజసిద్ధమైన పద్ధతులతో వేడిని నియంత్రించడం ఉత్తమం.

Follow Us