Actress : అతడికి 32.. ఆమెకు 19.. ఇద్దరూ తోపు హీరోహీరోయిన్లే.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే అందమైన జంట..
సౌత్ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె. మొదటి ఒకటి రెండు చిత్రాలతోనే సినీరంగంలో చక్రం తిప్పింది. కానీ 19 ఏళ్లకే 32 ఏళ్ల హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆడపాదడపా చిత్రాలు చేస్తూ కథానాయికగా రాణిస్తుంది. ఇప్పటికీ భార్యభర్తలు ఇద్దరూ తోపు నటీనటులు కావడం విశేషం. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరో తెలుసుకుందామా.

దక్షిణాది చిత్రపరిశ్రమలోనే తక్కువ సమయంలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన వారి గురించి చెప్పక్కర్లేదు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తార ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. కానీ ఆమె ప్రేమ, పెళ్లి వార్తలు అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇప్పటికీ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటున్ నజ్రియా నజీమ్. నేరమ్ సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అట్లీ తెరకెక్కించిన రాజా రాణి సినిమాతో తమిళంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..
రాజా రాణి తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించి మెప్పించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పుడు ఆమె వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. అలాగే పెళ్లి సమయానికి ఫహద్ వయసు 32 సంవత్సరాలు. దీంతో అప్పట్లో వారిద్దరి ప్రేమ, పెళ్లి చర్చనీయాంశంగా మారింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తిరిగి బిజీ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..
న్యాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నజ్రియా. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ ఆమె నటించిన తమిళం, మలయాళం చిత్రాలు తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న నజ్రియా నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. మరోవైపు నజ్రియా భర్త ఫహద్ మలయాళంలో తోపు హీరో. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో విలన్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..
నజ్రియా పోస్ట్..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
