AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా ఫ్రెష్‌గా ఉంటాయి

వేసవి రాగానే వంటగదిలో మహిళలకు పెద్ద తలనొప్పి మొదలవుతుంది. బయట ఎండలు 45 డిగ్రీలు దాటిపోతుంటే.. కిచెన్‌లో వస్తువులు అంతకంటే వేగంగా పాడైపోతుంటాయి. ముఖ్యంగా ఉదయాన్నే అమృతంలా కాచిన పాలు.. మధ్యాహ్నానికి చూసేసరికి విరిగిపోతాయి. మరి ఈ మండుటెండల్లో కూడా పాలు అస్సలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా ఫ్రెష్‌గా ఉంటాయి
How To Prevent Milk From Curdling
Krishna S
|

Updated on: May 23, 2026 | 6:44 AM

Share

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో వంటగదిలో పనులు చేసేవారికి తిప్పలు తప్పడం లేదు. బయట ఎండల ప్రభావం ఇళ్లలోని వస్తువులపై కూడా పడుతోంది. ముఖ్యంగా కిచెన్‌లో ఉండే వస్తువుల్లో అన్నింటికంటే వేగంగా పాడైపోయేవి పాలే. ఉదయాన్నే కాచిన పాలు కొన్ని గంటల్లోనే పులిసిపోవడం, లేదా మళ్లీ వేడి చేసినప్పుడు విరిగిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఉష్ణోగ్రతలు 45 నుండి 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పుడు పాలను ఎక్కువసేపు తాజాగా ఉంచడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. అధిక వేడి కారణంగా పాలలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, అవి విరిగిపోయేలా చేస్తుంది. అయితే పాలు కాచిన వెంటనే పాటించాల్సిన కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే.. ఈ తీవ్రమైన ఎండల్లో కూడా పాలు విరిగిపోకుండా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పాలు మరిగించిన వెంటనే ఈ తప్పు చేయకండి..

చాలా మంది పాలు మరిగించిన తర్వాత వాటిని గంటల తరబడి వంటగదిలోనే వదిలేస్తారు. వేసవిలో చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. వేడి వాతావరణంలో పాలను అలా వదిలేయడం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. పాలు మరిగించిన తర్వాత అవి కాస్త చల్లారగానే వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒకవేళ పాలు వేగంగా చల్లబడాలంటే.. ఒక పెద్ద పాత్రలో చల్లటి నీళ్లు పోసి, ఆ నీళ్లలో పాల గిన్నెను ఉంచాలి. పాలు త్వరగా చల్లారిన తర్వాత వెంటనే ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.

మరిగించేటప్పుడు చిటికెడు వేస్తే చాలు..

పాలు పదేపదే విరిగిపోతున్నాయని అనిపిస్తే, పాలను మరిగించేటప్పుడు అందులో కేవలం చిటికెడు బేకింగ్ సోడా కలపాలి. ఇది పాలలో పెరిగే అసిడిటీని సమతుల్యం చేసి, పాలు త్వరగా విరిగిపోకుండా నివారిస్తుంది. బేకింగ్ సోడా పాలను చాలా గంటల పాటు తాజాగా ఉంచుతుంది. అయితే జాగ్రత్త.. బేకింగ్ సోడా కేవలం చిటికెడు మాత్రమే వేయాలి, ఎక్కువైతే పాల రుచి మారిపోతుంది.

పదేపదే వేడి చేయడం ఆపండి

చాలా ఇళ్లలో పాలను రోజుకు మూడు నాలుగు సార్లు వేడి చేస్తుంటారు. వేసవిలో ఇలా పదేపదే వేడి చేయడం వల్ల పాల ఆకృతి మారి, అవి విరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి మీకు ఎంత క్వాంటిటీ పాలు అవసరమో.. అంతవరకు మాత్రమే ఫ్రిజ్ నుండి విడిగా తీసుకుని వేడి చేయడం మంచి పద్ధతి.

పాలు మరిగించే మంటపై దృష్టి పెట్టండి

పాలను ఎప్పుడూ కూడా తక్కువ లేదా మధ్యస్థ మంట మీదనే మరిగించాలి. అకస్మాత్తుగా హై ఫ్లేమ్‌లో పెట్టి వేడి చేయడం వల్ల పాలలోని ప్రోటీన్లు విచ్ఛిన్నమై పాలు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంది.

 నిల్వ చేసే సరైన విధానం

పాలను నిల్వ చేసే పాత్ర ఎల్లప్పుడూ పూర్తిగా శుభ్రంగా, తడి లేకుండా పొడిగా ఉండాలి. పాలను నిల్వ చేయడానికి స్టీల్ లేదా గాజు పాత్రలను వాడటం ఉత్తమం. మురికిగా లేదా తడిగా ఉన్న పాత్రల్లో పోస్తే పాలు వెంటనే విరిగిపోతాయి. అలాగే పాలను రిఫ్రిజిరేటర్ డోర్ భాగంలో పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ తలుపు మాటిమాటికీ తీయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతుంటుంది. కాబట్టి టెంపరేచర్ స్థిరంగా ఉండే ఫ్రిజ్ లోపలి భాగంలో పాల పాత్రను ఉంచడం సురక్షితం.

Follow Us
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..