Heatwave Alert: అగ్నిగోళంలా మారిన సూర్యుడు.. ఏ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి!
రోహిణీ కార్తె సమయం ఆసన్నమైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గతవారం రోజులుగా రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. రాబోయే రెండ్రోజుల పాటు కూడా ఎండలు ఇలానే ఉండనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాబట్టి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాల్లో ఉష్ణోగ్రలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తెలుగురాష్ట్రాలపై భానుడు భగ్గుమంటున్నాడు. అగ్నిగోళంగా మారి జనాలపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో అడుగు బయటపెట్టాలన్నా జనాలు వణికిపోతున్నాయి. జస్ట్ కిలోమీటరు దూరం ప్రయాణం చేస్తే చాలూ కళ్లు బైర్లు కమ్మేంత వేడి జనాలను భయపెడుతోంది. ఇక బయట వేడికి భయపడి ఇంట్లో ఉందామన్నా.. భరించలేనంత ఉక్కపోత. ఫ్యాన్లు, కూలర్లు ఆగకుండా తిరుగుతున్నా చెమలు మాత్రం ఆగడం లేదు. ఇందుకు ప్రధాన కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో మునుపెన్నడూ లేనంతగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వండం. రాబోయే రెండ్రోజులు కూడా పరిస్థితి ఇలానే ఉండబోతుందట.
తెలంగాణలో ఉష్ణోగ్రలు
ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో రాత్రిపూట కూడా ఆ సెగలు తగ్గట్లేదు. గాలిలో తేమ శాతం కనిష్ఠానికి పడిపోవడంతోనే చల్లదనం జాడలేకుండా పోతోంది. ఇక రాష్ట్రంలో ఇవాళ 18 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఏపీలో ఉష్ణోగ్రతలు ఇలా
ఇక అటు ఏపీలోనూ సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్‌కి చేరింది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రలలు నమోదవుతున్నాయి. రోహిణి కార్తె సమీపిస్తుండడంతో పలు ప్రాంతాల్లో రోళ్లు పగిలే ఎండలు కనిపిస్తున్నాయి. నిన్న పల్నాడులో రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మండలాలల్లో 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమెదు కాగా..150 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాబట్టి అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో వర్సాలు
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మాడుపగిలే ఎండలు కొడుతుండగా రాయలసీమ పరిధిలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ ఉరుములు, బలమైన మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
