AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!

Horoscope Today (May 23, 2026): శనివారంనాటి రాశిఫలాల్లో కొన్ని రాశుల వారికి పని ఒత్తిడి, కొత్త బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొన్ని రాశుల వారు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి గుర్తింపు, ఆర్థిక లాభాలు పొందే అవకాశముంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితులు ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోండి.

మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
Horoscope Todayin Telugu 23 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 23, 2026 | 5:35 AM

Share

దిన ఫలాలు (మే 23, 2026): మేష రాశి వారికి ఈ రోజు కొద్దిగా పని భారం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతల వల్ల శ్రమాధిక్యత ఉంటుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలుంటాయి. కొద్దిగా పని భారం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొత్త బాధ్యతల వల్ల శ్రమాధిక్యత ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపా రాల్లో కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభదాయకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే ఆలోచనలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. బంధువులతో సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల పరిస్థితి బాగా ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరు గుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని బాగా తగ్గించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ జీవితం ఉత్సాహం కలిగిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో కొన్నిసానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. కొత్త వ్యాపారాల ప్రయత్నాలకు అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా చికాకు పెడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుం టారు. స్నేహితులు, సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. చదువుల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి కొద్దిగా ఒత్తి డికి గురవుతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, అనవసర ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగా హ్యాపీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికార బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి, నష్టాల నుంచి కొంతవరకు బయటపడతాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో అధికారుల అండతో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పోటీదార్లు కానీ, సహోద్యోగులు కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు చాలావరకు నెరవేరుతాయి. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాలు ఉత్సాహంగా, హుషారుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థి కంగా ఆశించిన పురోగతి ఉంటుంది. దైవకార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

Follow Us
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్