AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జుట్టుకు దీన్ని రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు.. ఈ అద్భుతమైన చిట్కా మీకోసమే..

మారుతున్న కాలం, పెరుగుతున్న కాలుష్యం వల్ల ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న మోస్ట్ కామన్ ప్రాబ్లం.. జుట్టులరా.డం! దువ్వెన పడితే చాలు గుప్పెళ్ల కొద్దీ జుట్టు ఊడిపోతోందా? ఈ సమస్య నుంచి బయటపడటానికి ఖరీదైన షాంపూలు అవసరం లేదు. అద్భుతమైన చిట్కాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జుట్టుకు దీన్ని రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు.. ఈ అద్భుతమైన చిట్కా మీకోసమే..
How To Stop Hair Fall At Home
Krishna S
|

Updated on: May 23, 2026 | 7:16 AM

Share

కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధించే అతిపెద్ద సమస్య జుట్టు రాలడం. పొల్యూషన్, తప్పుడు ఆహారపు అలవాట్లు, విపరీతమైన ఒత్తిడి వల్ల వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి చాలా మంది హెయిర్ స్పా ట్రీట్‌మెంట్లు, సెలూన్ థెరపీలు, ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయినా సరే ఆశించిన ఫలితం కనిపించక నిరాశకు గురవుతుంటారు. అయితే జుట్టు రాలడాన్ని అడ్డుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో జుట్టు రాలడాన్ని అడ్డుకుని, ఒత్తైన కురులను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పవర్‌ఫుల్ హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ఏంటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

జుట్టును స్ట్రాంగ్‌గా మార్చే మ్యాజికల్ హెయిర్ ప్యాక్

ఈ హోమ్ రెమెడీ కోసం వాడే ప్రతి పదార్థం జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు:

  • ఉసిరి పొడి – 1 టీస్పూన్
  • భృంగరాజ్ పొడి – 1 టీస్పూన్
  • పెరుగు – 1 టీస్పూన్
  • గోరువెచ్చని కొబ్బరి నూనె– 1 టీస్పూన్

ఈ పదార్థాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?

ఉసిరి పొడి: ఇందులో ఉండే విటమిన్-సి జుట్టు పెరగడానికి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే జుట్టు తెల్లబడకుండా కాపాడుతుంది.

భృంగరాజ్ పొడి: ఆయుర్వేదంలో భృంగరాజ్‌ను కేశరాజ అని పిలుస్తారు. ఇది జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణను పెంచి, కొత్త జుట్టు మొలిచేలా చేస్తుంది.

పెరుగు: పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ తలలోని చుండ్రును నివారించి, స్కాల్ప్‌ను క్లీన్‌గా ఉంచుతుంది.

కొబ్బరి నూనె: జుట్టుకు కావలసిన పోషణను అందించి, మృదువుగా మారుస్తుంది.

ప్యాక్ తయారు చేసే విధానం – అప్లై చేసే పద్ధతి:

  • ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఉసిరి పొడి, భృంగరాజ్ పొడి, తాజా పెరుగు, కొద్దిగా గోరువెచ్చని కొబ్బరి నూనె వేసి ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్లకు, స్కాల్ప్‌కు పట్టేలా సున్నితంగా అప్లై చేయాలి.
  • ఈ ప్యాక్‌ను తలపై కనీసం 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.
  • ఆ తర్వాత కెమికల్స్ లేని మైల్డ్ షాంపూ లేదా కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి.
  • చివరగా జుట్టు ఆరిన తర్వాత అందులోని తేమ పోకుండా ఉండటం కోసం మరో రెండు చుక్కల గోరువెచ్చని కొబ్బరి నూనెను జుట్టుకు లైట్‌గా అప్లై చేయాలి.

వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ ఆయుర్వేద హోమ్ మేడ్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడితే.. కేవలం కొన్ని వారాల్లోనే జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా, నల్లగా, సిల్కీగా మారడం మీరే గమనిస్తారు.

(గమనిక: ఈ కథనంలోని విషయాలు కేవలం అవగాహన, సాధారణ సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. జుట్టు రాలడానికి అంతర్గత ఆరోగ్య సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. కాబట్టి ఈ చిట్కాలను పాటించే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)

Follow Us
జుట్టుకు దీన్ని రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు..
జుట్టుకు దీన్ని రాసుకుంటే ఒక్క వెంట్రుక కూడా రాలదు..
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
ఎండకు పాలు విరిగిపోతున్నాయా.. ఇదొక్కటి కలిపితే ఎన్ని గంటలైనా..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
కష్టాలు వెంటాడుతున్నాయా? చాణక్యుడు చెప్పిన ఈ మాటలు
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!