మామిడి పండ్లు తినే ముందు ఈ ఒక్క పని చేయకపోతే మీకే నష్టం!

22 May 2026

TV9 Telugu

TV9 Telugu

మామిడి పండ్లను చూస్తే అస్సలు ఆగలేం.. వాటిని తినేదాకా మనసు శాంతించదు. అయితే ఆ ఆతృతే వద్దంటున్నారు నిపుణులు. ఈ పండ్లను తినే ముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం మంచిదంట

TV9 Telugu

‘ఎ’, ‘సి’, ‘ఇ’, ‘కె’, ‘బి6’ విటమిన్లతో పాటు ఫోలేట్‌.. వంటి పోషకాలు మిళితమై ఉన్న మామిడి పండ్లు రుచిలోనే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ ఎంతో మేటి

TV9 Telugu

ముఖ్యంగా చర్మం, జుట్టు సంరక్షణ విషయాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ ప్రయోజనాలన్నీ చేకూరాలంటే తినే ముందు వాటిని 1-2 గంటల పాటు నీటిలో నానబెట్టడం మంచిదంటున్నారు

TV9 Telugu

ఒకవేళ వెంటనే తినాలనుకునే వారు కనీసం పావుగంట సేపైనా నీటిలో నానబెట్టి తినే ముందు బాగా కడగాలని సూచిస్తున్నారు. వేసవిలో తప్ప ఇతర సీజన్లలో దొరకవని కొంతమంది అమితంగా వీటిని లాగించేస్తుంటారు

TV9 Telugu

దీనివల్ల కొంతమంది శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తవుతుంది. అయితే తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెడితే.. తద్వారా పండ్ల నుంచి శరీరంలో వేడి ఉత్పత్తి చేసే గుణాలు తొలగిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు

TV9 Telugu

మామిడి పండ్లు త్వరగా పండడానికి వివిధ రకాల రసాయనాలు ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇలా వాడిన రసాయనాల ప్రభావం పండు తొక్క పైన ఎక్కువగా ఉంటుంది

TV9 Telugu

ఈ క్రమంలో- వాటిని ఆదరాబాదరాగా శుభ్రం చేసుకొని తీసుకుంటే.. ఆరోగ్యానికి ప్రమాదం! కాబట్టి, తినే ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం మంచిదంటున్నారు నిపుణులు

TV9 Telugu

మామిడి పండ్లలో విటమిన్ ఎ కళ్లు పొడిబారటం వంటి సమస్యలు దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే రక్తహీనతను తగ్గించే ఐరన్ కూడా దీనిలో దండిగా ఉంటుంది