Alcohol: రమ్, వోడ్కా, వైన్, విస్కీ ఈ పేర్లతో తికమకపడుతున్నారా.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..

రమ్, వోడ్కా, వైన్, విస్కీల మధ్య వ్యత్యాసం వాటి తయారీ ప్రక్రియ నుంచి వాటిలో ఆల్కహాల్ ఎంత ఉంటుందో తెలుసుకుందాం..

Alcohol: రమ్, వోడ్కా, వైన్, విస్కీ ఈ పేర్లతో తికమకపడుతున్నారా.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
Rum, Vodka, Wine, Whisky,
Follow us

|

Updated on: Oct 12, 2022 | 9:33 AM

రమ్, వోడ్కా, వైన్, విస్కీ మధ్య తేడా ఏంటో మద్యం ప్రియులకు బాగా తెలుసు. కానీ ఔత్సాహికులు, అరుదుగా మద్యం సేవించే చాలా మందికి దాని గురించి తక్కువ జ్ఞానం ఉంటుంది. ఆల్కహాల్‌ను కూడా ముట్టుకోని వారికి దాని గురించి అస్సలు తెలియదు. ఆల్కహాల్ చుక్క కూడా తాగని వారు కొందరు ఉన్నప్పటికీ.. దానిలో అన్ని రకాల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. అంతెందుకు రోజు మద్యం తాగేవారికి వీటిలో ఉన్న తేడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే రమ్, వోడ్కా, వైన్, విస్కీ అన్ని వేరు వేరు అయినా.. ఇందులో ఉండే తేడాను పూర్తిస్థాయిలో గుర్తించలేరు. అయితే మా ఈ కథనం వివిధ రకాల ఆల్కహాల్ గురించి తెలియని వారికి దాని గురించి సమాచారాన్ని అందిస్తున్నాం.. అయితే ఎలాంటి మద్యం అయినా ఆరోగ్యానికి హానికరమే అన్నది మాత్రం గుర్తుంచుకోవాలి.

వీటిలో చాలా తేడాలున్నాయి..

రమ్, వోడ్కా, వైన్, విస్కీల మధ్య వ్యత్యాసం వాటి తయారీ ప్రక్రియ నుంచి మొదలు.. వాటిలో ఉండే ఆల్కహాల్ పరిమాణంలో కూడా తేడా ఉంటుంది. ఇది కాకుండా, వాటి రుచి, రంగు కూడా భిన్నంగా ఉంటాయి. వీటిని తీసుకోవడంలో మాత్రం ఎవరికి వారు నిర్ణయించుకోవల్సి ఉంటుంది.

రమ్..

ప్రజలు చలికాలంలో తక్కువ డబ్బుతో అధిక ఆల్కహాల్ శాతం ఉన్న రమ్‌ను తాగడానికి ఇష్టపడతారు. ఇందులో 40 శాతానికి పైగా ఆల్కహాల్ ఉంటుంది. ఇది చెరుకు రసాన్ని పులియబెట్టి తయారు చేస్తారు. అందుకే ఇది చాలా స్పెషల్ మద్యం అని చెప్పవచ్చు. మిగతా మద్యం రకాలేవీ చెరకుతో తయారు చేయరు. చెరకును ఉడకబెట్టి, స్కిమ్మింగ్ చేసి, అందులో మిగిలిన మొలాసిస్, అవక్షేపాలతో రమ్‌ను తయారు చేస్తారు. ముఖ్యంగా మొలాసిస్, అవక్షేపాలను పులియబెట్టడం ద్వారా రమ్ తయారవుతుంది. రమ్‌లో కూడా ఆరోగ్యగప్రయోజనాలు ఉన్నాయి. అయితే అవి మితంగా తాగినప్పుడే శరీరానికి అందుతాయి. అధికంగా తాగితే ఇతర సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. 

వోడ్కా..

40 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉన్న వోడ్కా.. మంచి నీటిలా కనిపిస్తుంది. కానీ దాని ప్రభావం చాలా వేగంగా, ప్రభావవంతంగా ఉంటుంది. తూర్పు ఐరోపా, రష్యా దాని ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. వోడ్కా తయారీకి ధాన్యం, మొలాసిస్‌ను ఉపయోగిస్తారు. ఇథనాల్ కలిగి స్వేదనం చేయబడ్డ ఒక మత్తు పానీయం. పోలాండ్, రష్యా దేశాలలో దీనిని మొదటగా తయారు చేశారు. సాంప్రదాయికంగా వోడ్కా తయారీలో పులియబెట్టిన తృణ ధాన్యాలను, బంగాళాదుంపలను వినియోగిస్తారు. అయితే ఆధునిక పద్ధతులలో తయారు చేయబడే వోడ్కాలో ఫలాలు కూడా వినియోగిస్తున్నారు. చాలా శతాబ్దాల నుంచి వాడుకలో ఉన్న వోడ్కా వంటి పానీయాలకు నేటి వోడ్కాకు చాలా తేడా ఉంది. ప్రాచిన కాలంలో ఆల్కహాల్ స్పిరిట్ వేరే రుచి, రంగు, వాసన కలిగి ఉండేది. దీనిని ఒక ఔషధంగా ఉపయోగించారు. ఇందులో తక్కువ ఆల్కహాల్ అంటే గరిష్టంగా 14% ఉండేది. కాని ఇప్పుడు మారిపోయింది.

వైన్ ..

వైన్ చాలా తక్కువ ఆల్కహాల్, అద్భుతమైన రుచికి కలిగి ఉంటుంది. సాధారణంగా ప్రజలు కూడా ఎక్కువగా తాగుతారు. సమతుల్య పరిమాణంలో వైన్ తాగడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని మద్యం సేవించేవారు చెప్పుకుంటారు. ఇందులో 9 నుంచి 18 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీని తయారీకి ద్రాక్ష వంటి పండ్లను ఉపయోగిస్తారు. ద్రాక్షను సేకరించిన తర్వాత, దానిని పులియబెట్టడం కోసం వైనరీకి తరలిస్తారు. ఈ దశలో వైట్ వైన్ తయారీ, రెడ్ వైన్‌ల తయారీ వేర్వేరు పద్ధతిలో జరుగుతుంది. రెడ్ వైన్ అనేది ఎర్ర లేదా నల్ల ద్రాక్షను తొక్కతో సహా పులియబెట్టిన సమయంలో ఆ పండ్లలోని గుజ్జు నుంచి తయారవుతుంది. వైట్ వైన్ అనేది ద్రాక్షను బాగా మిక్స్ చేసిన తర్వాత రసంను పులియబెట్టడం ద్వారా తయారవుతుంది. ఈ విధానంలో ద్రాక్షకు ఉన్న తొక్కను తీసివేస్తారు. దీని తర్వాత వైన్ తయారీలో తొక్కకు ఎలాంటి ప్రాముఖ్యం ఉండదు. 

విస్కీ..

గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల నుంచి తయారైన విస్కీలో 30 నుంచి 65 శాతం ఆల్కహాల్ ఉంటుంది. సాధారణంగా, ఇందులో ఆల్కహాల్ కంటెంట్ దాదాపు 40 శాతం ఉంటుంది.  కెనడా, భారత్, జపాన్ లాంటి దేశాల్లో విస్కీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారు. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు మనం పాటించే పద్ధతినే పాటిస్తాయి. విస్కీలో స్కాచ్, బర్బన్, జపనీస్, ఐరిష్, టెన్నీస్, కెనడియన్, రై విస్కీ అంటూ చాలా రకాలు ఉంటాయి. ఎంత ఎక్కువ ధర ఉంటే అంత ఎక్కువ క్వాలిటీ ఉన్నట్లు మద్యం ప్రియులు అంటుంటారు. తక్కువ ధరతో లభించే విస్కీని కాక్ టెయిల్స్ తయారీకి వాడడం మంచి పద్ధతి. ఎక్కువ ధర ఉన్నవాటిలో కొద్దిగా నీళ్లు కలుపుకొని అలాగే సిప్ చేయడానికి ఉపయోగించడం వల్ల మంచి కిక్ వస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు