AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship Tips: భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే ఈ 6 విషయాలను అస్సలు చెప్పొద్దు..!

Relationship Tips: భార్యభర్తల బంధంపై అనేక ట్రోల్స్, మీమ్స్ వస్తుంటాయి. చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తుంటారు. పెళ్లంటేనే బాధల మయం అన్నట్లుగా చిత్రీకరిస్తుంటారు. కానీ, వాస్తవానికి మాత్రం పెళ్లి అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆ బంధంలో ఉండే మాధుర్యమే వేరు. దంపతులు కొట్టుకున్నా తిట్టుకున్నా చివరకు ఒక్కటిగానే ఉంటారు. అయితే, వివాహ బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. అయితే, మీరు మీ భాగస్వామికి చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ సంబంధం ప్రతికూల ప్రభావం చూపే కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Relationship Tips: భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే ఈ 6 విషయాలను అస్సలు చెప్పొద్దు..!
Couple Life
Shiva Prajapati
|

Updated on: Sep 22, 2023 | 9:30 PM

Share

Relationship Tips: భార్యభర్తల బంధంపై అనేక ట్రోల్స్, మీమ్స్ వస్తుంటాయి. చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తుంటారు. పెళ్లంటేనే బాధల మయం అన్నట్లుగా చిత్రీకరిస్తుంటారు. కానీ, వాస్తవానికి మాత్రం పెళ్లి అనేది జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆ బంధంలో ఉండే మాధుర్యమే వేరు. దంపతులు కొట్టుకున్నా తిట్టుకున్నా చివరకు ఒక్కటిగానే ఉంటారు. అయితే, వివాహ బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. అయితే, మీరు మీ భాగస్వామికి చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ సంబంధం ప్రతికూల ప్రభావం చూపే కొన్ని అంశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సమస్యలను పంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, చాలా సార్లు దంపతుల మధ్య పరస్పర వైరుధ్యం ఏర్పడుతుంది. గొడవలు జరుగుతాయి. దీని కారణంగా వారి సంబంధంలో సమస్యలు, ఎడబాటు మొదలవుతుంది. అందుకే.. మీ బంధంలో అనవసరమైన చీలికలు, తగాదాలను నివారించడానికి కొన్ని చిట్కాలను ఇవాళ మనం తెలుసుకుందాం. మీ భాగస్వామితో ఎనాడూ అనకూడని మాటలు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే.. మీ బంధం మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది.

1. నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను – పెళ్లి గురించి పశ్చాత్తాపం వ్యక్తం చేయడం మీ భాగస్వామికి విపరీతమైన బాధ కలిగిస్తుంది. ఇది మీ బంధం ప్రేమను తగ్గిస్తుంది. నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విచారం వ్యక్తం చేసే బదులు కలిసి రాబోయే సవాళ్లను ఎదుర్కోవడం మంచిది.

2. ‘మీరు మీ తల్లిదండ్రుల మాదిరిగానే ప్రవర్తిస్తారు’ – మీ భాగస్వామిని వారి తల్లిదండ్రులతో పోల్చడం మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఇలా అనడం వల్ల మీ సంబంధంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఏదైనా పరిస్థితిలో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే.. నేరుగా దాని గురించే మాట్లాడండి.

3. ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ – ఈ మాటలు మీ భాగస్వామికి చాలా బాధ కలిగిస్తాయి. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. మీ ప్రేమ గురించి మీకు స్వల్పంగానైనా సందేహం ఉంటే.. కౌన్సెలింగ్, థెరపీని తీసుకోవాలి.

4. ‘నేను మరొకరిని పెళ్లి చేసుకుంటే బాగుండేది’ – నేను నిన్ను చేసుకునే బదులు.. వేరొకరిని చేసుకున్నా బాగుండేది’ అని అస్సలు అనొద్దు. మీ భాగస్వామి మనసు బాధపడుతుంది. వ్యర్థమైన మాటలు మాట్లాడే బదులు.. ఉన్న బంధాన్ని నిలుపుకునేందుకు ఏం చేం చేయాలో ఆలోచించడం బెటర్.

5 ‘అన్ని సమస్యలకు నువ్వే కారణం’- వైవాహిక జీవితంలోని అన్ని సమస్యలకు మీ భాగస్వామిని నిందించడం మంచిది కాదు. ఇది సమస్యను పరిష్కరించదు. సంబంధాన్ని బలోపేతం చేయదు. ఏదైనా సమస్యను ఎదుర్కోవటానికి ఒకరికొకరు సపోర్ట్‌గా ఉండాలి. ఏ కారణం చేతనైనా భాగస్వామిని నిందించవద్దు.

6. ‘మీరు చాలా చెడ్డ తండ్రి/తల్లివి’ – మీ భాగస్వామిని వారి మాతృత్వం/ పితృత్వం గురించి అవమానించడం మీ సంబంధానికి చాలా ప్రమాదకరం. పిల్లల పెంపకం విషయంలో దంపతులు గొడవ పడడం సహజమే. కానీ పిల్లల ముందు ఒకరితో ఒకరు గౌరవంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
నడుము డిస్క్ సమస్యలకు ఆధునిక వైద్యం
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా