Ram, Sheep Marriage: గ్రామంలో వింత ఆచారం.. సంక్రాంతి తర్వాత గొర్రెకు, పొట్టేలుకు ఘనంగా పెళ్లి..

వర్షాలు కురవక పొతే కప్పలకు పెళ్లి చేయడం మనం సర్వసాధారణంగా విన్నదే.. అయితే సంక్రాంతి పండగ ముగిసిన తర్వాత రెండు మూగజీవాలకు పెళ్లి చేస్తే తమ గ్రామానికి అంతా మంచే జరుగుతుందని...

Ram, Sheep Marriage:  గ్రామంలో వింత ఆచారం.. సంక్రాంతి తర్వాత గొర్రెకు, పొట్టేలుకు ఘనంగా పెళ్లి..
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2021 | 12:53 PM

Ram, Sheep Marriage: వర్షాలు కురవక పొతే కప్పలకు పెళ్లి చేయడం మనం సర్వసాధారణంగా విన్నదే.. అయితే సంక్రాంతి పండగ ముగిసిన తర్వాత రెండు మూగజీవాలకు పెళ్లి చేస్తే తమ గ్రామానికి అంతా మంచే జరుగుతుందని వివాహం జరిపించే వింత సంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుజిల్లాలో ఇంకా కొనసాగుతుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని కేవీపల్లె మండలంలోని కురవపల్లెలోని ప్రజలు గొర్రె, పొట్టేలుకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగ మూడురోజుల సంబరాలు ముగిసిన రెండో రోజు ఇలా మూగజీవాలకు పెళ్లి చేయడం కురవపల్లె ఆనవాయితీగా వస్తుంది. ఇలా పెళ్లి చేస్తే.. తమ గ్రామం సుభిక్షంగా ఉంటుందని.. పంట పొలాలకు చీడపీడలుండవని.. గొర్రెలకు జంతువులకు అంటువ్యాధులు రావని.. తమను గౌరమ్మ కాపాడుతుందని గ్రామస్థులు చెప్పారు. అందుకనే ఈ ఏడాది కూడా గొర్రె, పొట్టెలికి వైభంగా వివాహం జరిపించారు.

ముందు గ్రామస్థులు దొడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వధూవరులుగా గొర్రె, పోట్టెలను అలంకరించారు. వరుడి వైపు కిరణ్‌కుమార్, వధువు వైపు దామోదర్‌ కుటుంబసభ్యులు నిలిచి ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. ఈ పెళ్ళికి హాజరైన కొంతమంది సెల్ ఫోన్ లో పెళ్లి వేడుకను వీడియో తీశారు.

Also Read: ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ లీడర్స్, ఎక్కడిక్కడే నేతల అరెస్ట్