Raja Ram Mohan Roy: భారతదేశంలోని మూఢ నమ్మకాలను తొలిసారిగా వ్యతిరేకించిన పోరాటశీలి రాజా రామ్మోహన్ రాయ్..
Raja Ram Mohan Roy: రాజా రామ్మోహన్ రాయ్..భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహుడుగా పేరుగానించిన వారు. భారతదేశంలో ఉన్న ఎన్నో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు.
Raja Ram Mohan Roy: రాజా రామ్మోహన్ రాయ్..భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహుడుగా పేరుగానించిన వారు. భారతదేశంలో ఉన్న ఎన్నో మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన వారు. సంస్కరణ శీలి. ఈయన జయంతి ఈరోజు (మే 22) ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
‘భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహుడు’ రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో బాల్యవివాహాలు, సతీ సహగమనం పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించారు. వాటిని రద్దు చేయించేందుకు ఎంతో ప్రయత్నించారు. ఆయన 1828 లో భారత ఉపఖండంలో సామాజిక-మత సంస్కరణ ఉద్యమమైన బ్రహ్మ సమాజ్ స్థాపించారు. ఈయన పేరు రామ్మోహన్ రాయ్. అయితే ఈయనకు మొఘల్ చక్రవర్తి అక్బర్ II ‘రాజా’ బిరుదును ఇచ్చారు. దీంతో ఈయన పేరు రాజా రామ్మోహన్ రాయ్ గా స్థిరపడిపోయింది. 1772 సంవత్సరం మే 22 న బెంగాల్ ప్రెసిడెన్సీలోని రాధనగర్ హూగ్లీలో వైష్ణవ కుటుంబంలో రామ్మోహన్ రాయ్ జన్మించారు. ఈయన కేవలం సామాజిక సంస్కర్త, విద్యావేత్త మాత్రమే కాదు, మతం, రాజకీయాలు, ప్రజా పరిపాలన రంగాలలో కూడా తనదైన ప్రభావం చూపారు. రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, బెంగాలీ, అరబిక్, పర్షియన్ భాషల్లో నిపుణులు. ఈయన 249 వ జయంతి నేడు. దాదాపు రెండున్నర శతాబ్దాలు గడిచిపోయినా.. రాజా రామ్మోహన్ రాయ్ చెప్పిన మాటలు ఇప్పటికీ మనకు కొత్త విషయాలుగానే ఉంటాయి. ఆచరణ యోగ్యంగా నిలుస్తాయి.
Raja Ram Mohan Roy : రాజా రామ్మోహన్ రాయ్ వెలుబుచ్చిన కొన్ని కోట్స్ ఈ సందర్భంగా ఇక్కడ ఇస్తున్నాం..
- “ఈశ్వర్ కేవల్ ఏక్ హై. ఉస్కా కోయి ఆంత్ నహిన్, సబీ జివిత్ వాస్తున్ మెయిన్ పర్మాత్మా కా అస్తిత్వా హై.”
- “హిందూ మతాన్ని వికృతీకరించే మూఢనమ్మక పద్ధతులకు దాని ఆదేశాల యొక్క స్వచ్ఛమైన ఆత్మతో ఎటువంటి సంబంధం లేదు.”
- “హిందువుల ప్రస్తుత వ్యవస్థ వారి రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి సరిగ్గా లెక్కించబడలేదు”
- “దుర్వినియోగం – అవమానించడం, కారణం – న్యాయంలకు భిన్నంగా ఉంటుంది”
- “సత్యం-ధర్మం తప్పనిసరిగా సంపద – శక్తికి సంబంధించినవి కావు
- “యూరోపియన్ పెద్దమనుషులతో మన సాగాత్యం ఎంత ఎక్కువైతే, సాహిత్య, సామాజిక మరియు రాజకీయ వ్యవహారాల్లో మన మెరుగుదల అంత ఎక్కువ అవుతుంది”
- “తెలివైన, మంచి పురుషులు తమకన్నా తక్కువ బలం ఉన్నవారిని బాధపెట్టడానికి ఎప్పుడూ ఇష్టపడరు”
Also Read: Wright Brothers: రైట్ సోదరుల విమానానికి పేటెంట్ కోసం మూడేళ్ళు పట్టింది.. ఎందుకో తెలుసా?