Sankranti Festival: గాలిపటాలు ఎగిరేసేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా ? లేకపోతే అంతే సంగతులు..
సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు చిన్న, పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగిరేయడానికి పోటీపడుతుంటారు. రంగు రంగుల గాలిపటాలను తీసుకువచ్చి..
సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు చిన్న, పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగిరేయడానికి పోటీపడుతుంటారు. రంగు రంగుల గాలిపటాలను తీసుకువచ్చి.. నీలి ఆకాశాన్ని తాకాలి అనేంతగా ఎగరేస్తుంటారు. గాలిపటాలను ఎగిరేయడం తప్పుకాదు.. కానీ వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఎవరు పాటించరు. ఇలా చేయడం వలన కొంత మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కోకొల్లలు. పెద్ద భవనాల పైకి వెళ్ళి గాలిపటాలను ఎగిరేస్తుంటారు. కానీ గాలిపటం ఎత్తుకు ఎగరాలి అనే తొందరభావంతో ఆ భవనంపై ఎక్కడ నిల్చున్నాం అనేది పట్టించుకోరు. అంతేకాకుండా కరెంట్ వైర్లు ఉన్నాయి అనేది చూసుకోకుండా వాటిని ఎగరేయడం చాలా డేంజర్. ఇక కొంత మంది రోడ్డు మీద వాహనాలు, పాదచారులు వస్తున్నా పట్టించుకోకుండా గాలిపటాలను ఎగరేస్తుంటారు. అయితే ఇందులో చేసే పెద్ద పొరపాటు ఎంటంటే.. వాటికి మాములు దారాలు కాకుండా చైనా మంజా దారాలను ఉపయోగించడం వలన అవి అటుగా వెళ్తున్న వారి మెడకు చుట్టుకుంటున్నాయి. వాటితో గొంతు తెగి తీవ్ర రక్తస్రావం జరుగుతంది. గాలిపటాలు ఎగిరేయడానికి ఇప్పటికే అధికారులు ఎన్నో సూచనలు ఇచ్చిన ఎవరు పట్టించుకోవడం లేదు.
ఇక గాలిపటాలను వాడే దారం, మంజా లాంటివి పక్షులు కాళ్ళకు, రెక్కలకు చిక్కుకొని ఇబ్బందులు పడడం, కొన్ని సందర్భాల్లో వాటి ప్రాణాలు పోవడం జరుగుతుంది. అయితే గాలిపటాలు ఎగిరేసేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా కరెంట్ స్తంభాలు, పెద్ద పెద్ద లైన్ల వద్ద గాలిపటాలు ఎగరేయొద్దు. విశాలమైన ప్రాంతాల్లో, మైదానాల్లో వాటిని ఎగురవేయాలి. అలాగే విద్యుత్ తీగలు, స్తంభాలు, సబ్ స్టేషన్లు మీద పడ్డ గాలి పటాలను తీసుకునేందుకు ప్రయత్నించవద్దు. వీటికోసం కాటన్, నైలాన్, లెనిన్ దారాలను మాత్రమే వాడాలి. మెటాలిక్ దారాలను ఉపయోగించడం వలన.. అవి విద్యుత్ తీగలకు తాకితే పెను ప్రమాదం జరుగుతుంది. పెద్ద భవనాలు, బాల్కనీలు, గోడలపై నిల్చుని గాలిపటాలను ఎగురవేయొద్దు. అంతేకాకుండా చిన్న పిల్లలను గాలి పటాలు ఎగురవేయనికుండా చూసుకోవాలి. అత్యవసర పరిస్థితి ఏర్పడితే 1912 లేదా సమీప విద్యుత్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించాలి.
Sankranthi Festival: సంక్రాంతి పండుగ రోజు ఈ పనులు అసలు చెయ్యొద్దంటా.. ఎందుకో తెలుసా ?