AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3day Weekends Every Week:ఆ దేశంలో ఉద్యోగులకు వారానికి మూడు రోజుల సెలవులు.. చట్టం చేయడానికి రాజకీయనేతలు డిమాండ్

3day Weekends Every Week:రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒక అద్భుతంలాగా పుంజుకొంది. అది ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దీనికి కారణం అక్కడ ప్రజలు సమయపాలన, కష్టపడి పనిచేయడమే. జపాన్ ఉద్యోగులంతా సమయానికి ఆఫీసుకు వచ్చి పని చేయడంలో నిమగ్నమవుతారు. అక్కడ ఉద్యోగులు అభద్రతా భావంతో సెలవు రోజుల్లో కూడా ఉద్యోగం చేస్తారు.. మరి అలాంటి దేశంలో ఉద్యోగులకు ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వమని ఓ సరికొత్త డిమాండ్ […]

3day Weekends Every Week:ఆ దేశంలో ఉద్యోగులకు వారానికి మూడు రోజుల సెలవులు.. చట్టం చేయడానికి రాజకీయనేతలు డిమాండ్
Surya Kala
|

Updated on: Jan 22, 2021 | 1:35 PM

Share

3day Weekends Every Week:రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒక అద్భుతంలాగా పుంజుకొంది. అది ప్రపంచంలో రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. దీనికి కారణం అక్కడ ప్రజలు సమయపాలన, కష్టపడి పనిచేయడమే. జపాన్ ఉద్యోగులంతా సమయానికి ఆఫీసుకు వచ్చి పని చేయడంలో నిమగ్నమవుతారు. అక్కడ ఉద్యోగులు అభద్రతా భావంతో సెలవు రోజుల్లో కూడా ఉద్యోగం చేస్తారు.. మరి అలాంటి దేశంలో ఉద్యోగులకు ఎక్కువ రోజులు సెలవులు ఇవ్వమని ఓ సరికొత్త డిమాండ్ కు రాజకీయ నాయకులు తెరలేపారు. కరోనా తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులకు వారంలో నాలుగు రోజులు పనిదినాలు ఇచ్చి.. మిగతా మూడు రోజులను వారాంతపు సెలవులుగా ప్రకటించాలని ఆ దేశ రాజకీయనేతలు అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా అనంతరం అక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేసిన మూడు రోజుల వారాంత సెలవుల విధానం విజయవంతం కావడంతో దీన్ని అమలు చేయాలంటున్నారు. దీనిపై చట్టం తీసుకురావడానికి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జపాన్ లో ఉద్యోగులకు ఇప్పటికే రెండు రోజులు వారాంతపు సెలవులు ఉన్నా యాజమాన్యాన్ని మెప్పించి ఉద్యోగ భద్రత పొందడం కోసం కొందరు.. వచ్చే జీతం కుటుంబ ఖర్చులకు సరిపోక మరికొందరు పార్ట్ టైం జాబ్ చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు ఉద్యోగులు కొన్నిసార్లు పనిచేస్తూ ఆఫీసుల్లోనే నిద్రపోతుంటారు. దీంతో వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొవడంతోపాటు కుటుంబం కోసం సమయం కేటాయించలేకపోతున్నారనే విషయాన్ని గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఉద్యోగుల కోసం కొత్త నిబంధనలు రూపొందించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల వారాంతపు సెలవుల విధానాన్ని తీసుకురావాలని కొన్నాళ్ల క్రితమే ఆలోచించింది. ఆచరణలో పెట్టె సమయంలో కరోనా వైరస్ వ్యాపించడం మొదలు పెట్టింది. దీంతో ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ ను దాదాపు అన్ని సంస్థలు కేటాయించాయి. దీంతో మళ్ళీ ఇన్నాళ్లకు మూడు రోజుల సెలవులను తెరపైకి తెచ్చారు అక్కడి నేతలు.

ఈ విధానం పై రాజకీయ నేతలు స్పందిస్తూ.. కరోనా సోకే ప్రమాదం తక్కువ అని .. ఇక ఉద్యోగులు ఇంటికే పరిమితమైతే ప్రజా రవాణా వాహనాల వినియోగం తగ్గుతుందని అన్నారు. ఇక ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతారు. లేదంటే.. ఆ మూడు రోజులు ఆదాయం కోసం ఇతర పనులు చేసుకుంటారు. లేదంటే ఉన్నత చదువులు చదువుకుంటారు.. తమలోని ప్రతిభను మరింత మెరుగురులు దిద్దుకుంటారు అని చెప్పారు. అయితే వారానికి మూడు రోజులు సెలవులు ప్రకటిస్తే.. జీతంలో 20 శాతం వరకూ తగ్గుతుందని … మూడు రోజులు సెలవులు ఉండటంతో ఆదాయం పెంపుకు మరో మార్గం చూసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే, సమస్యల్లా సంస్థలు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత.. ఉద్యోగ ప్రయోజనాలు యథావిధిగా కొనసాగించేలా చేయాలన్నారు. అలాగే ఈ బిల్లు తీసుకొస్తే ఉద్యోగులు వారంలో వారిని నచ్చినట్లుగా మూడు రోజులు సెలవులు తీసుకునే వీలు కల్పిస్తుందని నేతలు చెబుతున్నారు.

ఉద్యోగుల కోసం పనివేళలను.. పని వాతావరణాన్ని నచ్చిన విధంగా మార్చగలమని అక్కడి నేతలు నమ్ముతున్నారు. జపాన్‌లోని మైక్రోసాఫ్ట్‌.. తమ ఆఫీసులో ఉద్యోగులకు 2019 ఆగస్టు నెలలో మూడు రోజుల వారాంత సెలవులను ప్రయోగత్మకంగా అమలు చేసింది. ‘ది వర్క్‌ లైఫ్‌ ఛాయిస్‌ ఛాలెంజ్‌ సమ్మర్‌-2019’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ జపాన్‌ అద్భుత విజయం సాధించింది. ఈ మూడు రోజుల వారాంత సెలవు విధానంలో దాదాపు 40శాతం ఉత్పాదకత పెరిగిందని తేలింది. ఆ దేశంలోని మరో సంస్థ కూడా ఉద్యోగులకు ఈ విధానాన్ని స్వచ్ఛందంగా ఎంచుకునే అవకాశం కల్పించింది. ఈ విధానాన్ని అమలు చేస్తే చిన్న సంస్థలకు చేయూతగా ఆర్థిక ప్రోత్సాహం కల్పించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మరి ఈ మూడు రోజుల వారాంత సెలవులు అమల్లోకి ఎప్పుడు వస్తాయో… ఒకవేళ అక్కడ ఈ ప్రయోగం విజయవంతమైతే.. మరిన్ని దేశాలు వారానికి మూడు రోజుల సెలవు పై ఆలోచిస్తాయోమో చూడాలి మరి..

Also Read: క్షీణించిన చిన్నమ్మ ఆరోగ్యం.. పరిస్థితి విషమం.. వెంటిలేటర్ పై చికిత్స