AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI: మీరు ‘యూపీఐ’ ద్వారా పేమెంట్స్‌ చేస్తుంటారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. కీలక ప్రకటన చేసిన ఎన్‌పీసీఐ…

UPI Payments May Not Work In This Timings: పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్‌లో డిజిటల్‌ పేమెంట్ల హవా కొనసాగుతోంది. పది రూపాయల నుంచి రూ.వేల క్రయవిక్రయాల వరకు అందరూ యూపీఐ పేమెంట్‌లకే మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో..

UPI: మీరు 'యూపీఐ' ద్వారా పేమెంట్స్‌ చేస్తుంటారా.. అయితే ఈ వార్త మీ కోసమే.. కీలక ప్రకటన చేసిన ఎన్‌పీసీఐ...
Narender Vaitla
|

Updated on: Jan 22, 2021 | 12:52 PM

Share

UPI Payments May Not Work In This Timings: పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్‌లో డిజిటల్‌ పేమెంట్ల హవా కొనసాగుతోంది. పది రూపాయల నుంచి రూ. వేల క్రయవిక్రయాల వరకు అందరూ యూపీఐ పేమెంట్‌లకే మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో మొబైల్‌ ఆధారిత పేమెంట్స్‌ బాగా పెరిగిపోయాయి. ఈ తరుణంలో యూపీఐ ద్వారా డిజిటల్‌ పేమెంట్స్‌ చేసే వినియోగదారులకు ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా) తాజాగా కీలక ప్రకటన చేసింది. యూనిఫైడ్‌ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ)ని అప్‌గ్రేడ్ చేస్తున్న నేప‌థ్యంలో రాత్రి ఒంటి గంట నుంచి తెల్ల‌వారుజామున 3 గంట‌ల మ‌ధ్య‌లో పేమెంట్స్ చేయొద్ద‌ని నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) సూచించింది. అయితే ఎన్ని రోజుల‌నేది స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ రానున్న కొన్ని రోజులు అని తెలిపింది. దీంతో కొద్ది రోజుల పాటు డిజిటల్‌ చెల్లింపుల్లో అసౌకర్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. యూజర్లకు మరింత మంచి ఎక్స్‌పీరియన్స్‌తో పాటు భద్రత కల్పించే క్రమంలోనే తాము యూపీఐ అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని తెలిపారు.

Also Read: Archaeological Discovery:తవ్వకాల్లో 3వేల ఏళ్ల నాటి శవపేటిక, ఆలయం, మాస్క్ లు, ఆటవస్తులు చరిత్రను తిరగరాస్తాయా..!