గురువారం రూ. 50 లక్షల నగదు.. శుక్రవారం కేజీ బంగారం.. కంచికచర్ల పోలీసుల విసృత తనిఖీలు

పత్రాలు లేని సుమారు కేజీ బంగారాన్ని కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గంపలగూడెం నుంచి కృష్ణా జిల్లా కంచికచర్లకు బైక్‌పై తీసుకువచ్చి అక్కడ నుంచి షాపులకు అనుమతులు...

  • Ram Naramaneni
  • Publish Date - 12:51 pm, Fri, 22 January 21
గురువారం రూ. 50 లక్షల నగదు.. శుక్రవారం కేజీ బంగారం.. కంచికచర్ల పోలీసుల విసృత తనిఖీలు

పత్రాలు లేని సుమారు కేజీ బంగారాన్ని కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. గంపలగూడెం నుంచి కృష్ణా జిల్లా కంచికచర్లకు బైక్‌పై తీసుకువచ్చి అక్కడ నుంచి షాపులకు అనుమతులు లేకుండా బంగారం సప్లై చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.  వివరాల్లోకి వెళితే గంపలగూడెం నుంచి జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మైలవరపు రాజేష్, షేక్ రెహమాన్ అనే ఇద్దరు వ్యక్తులను కంచికచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సరైన పత్రాలు లేని కేజీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం ఆభరణాలను ఇన్‌కమ్ టాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

కంచికచర్ల మండలం దొనకొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.50 లక్షలతో గురువారం వ్యక్తి పట్టుబడ్డాడు. వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌కు గరుడ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి నుండి రూ.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో పాటు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నగదు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Kurnool District: ఏడేళ్ల చిన్నారిని బలి తీసుకున్న నాటు వైద్యం.. పరారీలో వైద్యులు..ఏం జరిగిందంటే..?

AP Government: ఉన్నత విద్యలో నూతన కోర్సులు.. రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు