Sasikala Health Updates: క్షీణించిన చిన్నమ్మ ఆరోగ్యం.. పరిస్థితి విషమం.. వెంటిలేటర్ పై చికిత్స

 దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనేస్తం శశికళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో బాధపడుతున్న చిన్నమ్మ కు కరోనా గా నిర్ధారణ అయ్యింది.. ప్రస్తుతం..

Sasikala Health Updates: క్షీణించిన చిన్నమ్మ ఆరోగ్యం.. పరిస్థితి విషమం.. వెంటిలేటర్ పై చికిత్స
Follow us

|

Updated on: Jan 22, 2021 | 12:33 PM

Sasikala Health Updates: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనేస్తం శశికళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నమ్మ శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం మొదట బెంగళూరులోని లేడీ క్యూర్‌జోన్ జాయిన్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో తొలుత రెండుసార్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. మెరుగైన చికిత్స కోసం ఆమెను విక్టోరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ కోవిడ్ నిర్ధారణ కోసం మళ్ళీ సీటీ స్కాన్‌ పరీక్షను నిర్వహించగా కరోనా బారిన పడ్డారని నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న శశికళ ఆరోగ్యం విషమించినట్టు వైద్యులు తెలిపారు. ఆమెకు మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు విక్టోరియా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు.

జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ కారాగార వాసం మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నెల 27న ఉదయం ఆమె జైలు నుంచి విడుదల కాబోతున్నారని శశికళ తరఫు న్యాయవాది రాజా సెతురపాండియన్‌ ఇటీవల వెల్లడించారు. 2016లో జయలలిత మరణానంతరం అక్రమాస్తుల కేసులో ఆమె అరెస్టయిన విషయం తెలిసిందే. దీంతో నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10కోట్లు జరిమానా చెల్లించి ఏడాది ముందుగానే విడుదల కాబోతున్నారు. మరో మూడు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ తన రాజకీయ పునరాగమనానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆమె జైలునుంచి విడుదల కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ తరుణంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శశికళ ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: పాలకుల పదవికి గండం తెస్తున్న కోవిడ్..వైరస్‌ని కట్టడి చేయలేక పదవికి రాజీనామా చేసిన దేశ ప్రధాని

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..