AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పూళ్ల, కొమరేపల్లిలో ఏలూరు తరహా వింతరోగ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి, ప్రజలు అధైర్య పడాల్సిన అవసరంలేదు’

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధి ఘటనల తర్వాత పూర్తి ప్రశాంతత నెలకొందని ఏపీ హెల్త్ చీఫ్ సెక్రటరీ అనిల్ సింఘాల్ చెప్పారు...

'పూళ్ల, కొమరేపల్లిలో ఏలూరు తరహా వింతరోగ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి, ప్రజలు అధైర్య పడాల్సిన అవసరంలేదు'
Venkata Narayana
|

Updated on: Jan 22, 2021 | 4:44 PM

Share

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధి ఘటనల తర్వాత పూర్తి ప్రశాంతత నెలకొందని ఏపీ హెల్త్ చీఫ్ సెక్రటరీ అనిల్ సింఘాల్ చెప్పారు. అయితే, ఇటీవల ఏలూరు పరిసర ప్రాంతాలైన పూళ్ల , కొమరేపల్లిలో ఈ తరహ ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా ఇదే తరహాలో కొన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయని, అయితే, ప్రజలు ధైర్యం కోల్పోవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. కొత్తగా వింతరోగం బారినపడ్డ రోగులందరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు. అయితే, తాగునీరే ఈ రోగాలకు కారణమా లేక, ఇతర కారణాలైమైనా ఉన్నాయా అనే విషయాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని గ్రామాల నుంచీ ఒకేసారి తాగు నీటి సరఫరా శాంపిల్స్ తీసుకుంటున్నామని, ఎందుకు ఇలా జరుగుతోందో ఆలోచించి శాశ్వత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి హైలెవెల్ కమిటి రిపోర్ట్ ఈ సాయంత్రం సీఎంకు నివేదిస్తామని ఆయన తెలిపారు.