AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sasikala: జైలు నుంచి విడుదలయ్యే చిన్నమ్మ కోసం హంగామా.. స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు..!

Sasikala: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలతున్న శశికళకు స్వాగతం పలికేందుకు ఆమె అభిమానులు, మద్దతుదారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు...

Sasikala: జైలు నుంచి విడుదలయ్యే చిన్నమ్మ కోసం హంగామా.. స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు..!
Subhash Goud
|

Updated on: Jan 22, 2021 | 4:52 PM

Share

Sasikala: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలతున్న శశికళకు స్వాగతం పలికేందుకు ఆమె అభిమానులు, మద్దతుదారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జయలలితకు స్వాగత సత్కారాలు జరిగినట్లుగానే శశికళకూ నిర్వహించాలని వారు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చైన్నై వరకూ కనీసం వెయ్యి వాహనాలతో ఆమెను ఆహ్వానించేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్రకళగం అధినేత టీటీవీ దినకరన్‌ బృందం ఏర్పాట్లు చేపట్టింది. అయితే బుధవారం ఆమె అనారోగ్యానికి గురవడంతో వారిని కాస్త ఆందోళనకు గురి చేసింది.

శశికళ జైలు నుంచి విడుదల కాగానే స్వాగతం పలికేందుకు ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన హూసూరులో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై ఆమె మద్దతుదారులు రహస్యంగా సమావేశాలు కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే జైలు నుంచి బయటకు రాగానే ఆమెకు స్వాగతం పలికేందుకు మద్దతుదారులు బెంగళూరుకు చేరుకోనున్నారు.

మరి కొందరు నేతలు హూసూరులో బస చేసి చిన్నమ్మకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలకు చెందిన కార్యకర్తలు, మద్దతు దారులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. వెయ్యి వాహనాల్లో శశికళ వాహనానికి ఎదురెళ్లి సరిహద్దుల్లో ఘన స్వాగతం పలకనున్నారు. ఇక చిన్నమ్మ జైలు నుంచి విడుదల కాగానే హూసూరుకు చేరుకున్న తర్వాత శూలగిరిలో కొంత సేపు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె చెన్నైకి బయలుదేరనున్నారు. శశికళ నగరానికి చేరిన తర్వాత మెరీనాతీరంలోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నగరంలో ఆమె కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన బంగళాకు చేరుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు.

అయితే శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో, అన్నాడీఎంకేలోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా శశికళ బంధువు, ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ మద్దతుదారుల జాబితా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చిన్నమ్మ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారా..? లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి ఒక కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన వారు ప్రత్యక్ష ఎన్నికల్లో నాలుగేళ్ల పాటు పోటీ చేసేందుకు అనర్హులు. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదలయ్యాక అనుకున్నది సాధించేందుకు పట్టు బిగించినట్లు తెలుస్తోంది. అలాగే తన పంతాన్ని నెగ్గించుకునేందుకు శశికళ తిరిగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఏకంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జట్టుకట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి చిన్నమ్మ విడుదలయ్యాక ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read: శ్రీ భవ్య రామ మందిర నిర్మాణంలో నేను సైతం అంటున్న జనసేనాని.. పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా.?