ఈ ఒక్క చెట్టు మీ తోటలో ఉంటే 30ఏళ్ల వరకు డబ్బే డబ్బు..! మార్కెట్ కష్టాలు, నష్టాల ఊసేలేదు..
వ్యవసాయంలో వివిధ పద్ధతులను ప్రయోగించి ఎప్పటికప్పుడు తాజా విషయాలను తెలుసుకునే వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా మంచి అభివృద్ధిని కూడా సాధిస్తారు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు కర్ణాటకకు చెందిన ఓ రైతు. చంద్రశేఖర్ ఆరాధ్య అనే రైతు తన 2 ఎకరాల భూమిలో ఆధునిక సాగు ద్వారా ఒక రకం చెట్లను నాటాడు.. ఇప్పుడు అతను ప్రతి నెలా సుమారు రూ.1 లక్ష ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇంతకు అతడు పెంచుతున్న ఆ చెట్లు ఏంటి..? ఆఅతడి విజయగాధేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రుచి సోయా ఇండస్ట్రీ పామాయిల్ రైతులకు ఉచితంగా మొక్కలను అందిస్తుంది. పొలంలో నేలను పరీక్షిస్తుంది. ఒక సంవత్సరం వయస్సు గల మొక్కలను ఇస్తుంది. అవి నాటిన నాలుగు సంవత్సరాల తర్వాత ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఇందులో అధిక నీటి శాతం ఉండాలి. ఇతర పంటలకు ఉపయోగించే ఎరువులు వేస్తే సరిపోతుంది. అవి పెరిగిన తర్వాత ఈ కంపెనీ పండ్లను సరసమైన ధరకు తీసుకుంటోంది.
2 ఎకరాల భూమిలో 200 కి పైగా ఈ పామాయిల్ చెట్లను నాటాడు రైతు ఆరాధ్య. నేడు ఆ చెట్ల నుండి లభించే పండ్లు, కాయలు మంచి ఆదాయాన్ని తెస్తున్నాయి. ఒక పామాయిల్ పండు 6 నుండి 7 కిలోల బరువు ఉంటుంది. కంపెనీ దానిని తీసుకొని డబ్బు చెల్లిస్తుంది. పంట నెలకు రెండుసార్లు వస్తుంది. ఇది 30 సంవత్సరాల వరకు ఈ చెట్లు ఫలాలను ఇస్తూనే ఉంటుంది.. కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు సబ్సిడీ కూడా ఇస్తుంది. నాలుగు సంవత్సరాల్లో పామాయిల్ కోతకు వచ్చిన తర్వాత వరుసగా మూడు నెలలు కాస్తూనే ఉంటుంది. తర్వాత ఒక నెల ఆగిపోతుంది. మరల మూడు నెలలు కాయ కాస్తుంది. దీనిని వంట నూనె తయారీకి ఉపయోగిస్తారు. పామ్ పండులోని ఎర్రటి గుజ్జు నుండి తయారు చేస్తారు. ఈ నూనె వంటకాలు, సౌందర్య ఉత్పత్తులు, జీవ ఇంధనంగా ఉపయోగిస్తారు.
ఇటీవలి కాలంలో రైతులు గత 8-10 సంవత్సరాలుగా ఈ పామాయిల్ చెట్లను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రారంభంలో కష్టంగా ఉన్నప్పటికీ నేడు పామాయిల్ చెట్లు రైతులకు ప్రధాన ఆర్థిక మద్దతుగా నిలుస్తున్నాయి. రైతులు సాంప్రదాయ వ్యవసాయంలో ప్రయోగాలు చేయాలి. పామాయిల్ చెట్లు ఏడాది పొడవునా ఉత్పత్తి చేసే పంట. తక్కువ నిర్వహణతో ఎక్కువ లాభం పొందుతారు పామాయిల్ రైతులు చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..




