Sesame Seeds : నెలసరి సమయంలో నువ్వులు తప్పక తినాలట..! బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
నెలసరి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే..పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పితో చాలా మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి రకరకాల మందులు కూడా వాడుతుంటారు. కానీ, ఇవన్నీ రాబోయే రోజుల్లో సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే, మందులు ఉపయోగించకుండా సహజ ఉత్పత్తులతో కూడా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో నువ్వులు ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు. పూర్తి డిటెల్స్‌లోకి వెళితే..

నువ్వులు పోషకాల భాండాగారంగా పిలుస్తారు. చలికాలంలో నువ్వులను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తరచూ పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా నెలసరి సమయంలో ఆడవాళ్లు నువ్వులు తినాలని చెబుతుంటారు. పిరియడ్స్ సమస్యలకు నువ్వులు దివ్యౌషధంగా పనిచేస్తాయని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. నువ్వులలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండి. వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. అందుకే ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్ల అసమతుల్యత సమస్యలను తగ్గించటంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
నెలసరి సమయంలో మొదటి 3-4 రోజులు నువ్వులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నువ్వుల మిఠాయిలు రక్తస్రావం సక్రమంగా జరగడానికి సహాయపడతాయి. శరీరానికి అవసరమైన పోషణ అందిస్తాయి. నెలసరి తర్వాత 10 రోజులు మినపప్పు తీసుకోవాలి. మినప వడలు, దోసె, గంజి రూపంలో తినవచ్చు. మినపప్పు ప్రోటీన్ సమృద్ధిగా ఉండి అండం వృద్ధికి సహాయం చేస్తుంది.
5వ రోజు నుంచి 28వ రోజు వరకు మెంతులు తీసుకోవాలి. మెంతులు గర్భాశయాన్ని బలపరుస్తాయి. అధిక రక్తస్రావం రాకుండా నిరోధిస్తాయి. క్రమబద్ధమైన ఆహార చక్రం శరీరాన్ని బలంగా ఉంచుతుంది. హార్మోన్ల సమతుల్యతను కూడా కాపాడుతుంది. నువ్వుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీని సహాయంతో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. అధిక స్థాయి ఈస్ట్రోజెన్ గర్భాశయం సంకోచాన్ని ప్రేరేపిస్తుంది. ఇందులో ఉండే జింక్, ఐరన్ శరీరంలో ఎర్ర రక్త కణాల పరిమాణాన్ని పెంచుతాయి.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








