బాబోయ్ వీళ్లు బెండకాయ అస్సలు తినొద్దట..! ఎంత డేంజర్ అంటే..
బాబోయ్ బెండకాయ వీళ్లకు ఎంత డేంజరో తెలుసా..? బెండకాయ ఆరోగ్యకరమైన కూరగాయ అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ, ఈ హెల్తీ కూరగాయ కొంతమందికి మాత్రం విషంతో సమానం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు బెండకాయ అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఎందుకంటే?

బెండకాయలో ఆక్సలేట్లు అధిక మొత్తంలో ఉంటాయి. శరీరంలో ఆక్సలేట్లు కాల్షియంతో కలిసినప్పుడు, అవి కాల్షియం ఆక్సలేట్ రాళ్లుగా మారతాయి. ఇదే కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి సాధారణ కారణం. మీకు ఇప్పటికే కిడ్నీలో రాళ్లు ఉన్నా లేదా మీ కుటుంబంలో ఈ సమస్య ఉన్నా, బెండకాయ తినడం మానుకోవాలి. ఒకవేళ తినాలనిపిస్తే, చాలా తక్కువ పరిమాణంలో తిని, ఎక్కువ నీరు తాగాలి. గౌట్ అనేది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల వచ్చే ఒక సమస్య. దీనివల్ల కీళ్లలో వాపు, నొప్పి వస్తుంది.
బెండకాయలో ఉండే ఆక్సలేట్లు యూరిక్ యాసిడ్‌ను స్ఫటికీకరణ ప్రక్రియలో సహాయపడతాయి, దీనివల్ల గౌట్ రోగుల సమస్యలు మరింత పెరుగుతాయి. అలాగే, కొంతమందికి బెండకాయ వల్ల అలర్జీ రావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. బెండకాయలో అధికంగా ఉండే ఫైబర్ సాధారణంగా జీర్ణక్రియకు మంచిది.
కానీ, కడుపులో గ్యాస్, ఉబ్బరం, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లేదా అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారికి బెండకాయ మరింత ఇబ్బంది కలిగించవచ్చు. ఇది కడుపు నొప్పి, అసౌకర్యాన్ని పెంచుతుంది. ఇలాంటివారు బెండకాయ తినడం మానుకోవడం లేదా వైద్యుల సలహాతోనే తీసుకోవడం మంచిది. రక్తం పలుచబడే మందులు తీసుకునేవారు కూడా బెండకాయకు దూరంగా ఉండాలి. బెండకాయ విటమిన్-కె కు మంచి వనరు. విటమిన్-కె రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. అయితే, రక్తం పలుచబడే మందులు (బ్లడ్ థిన్నర్స్) తీసుకునేవారు విటమిన్-కె పరిమాణంపై శ్రద్ధ వహించాలి.
( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








