Mustard oil cultivation: సేంద్రీయ పద్దతిలో ఆవాల సాగుతో లాభాల బాట.. సాగు విధానం సహా పూర్తి వివరాలు
భారతదేశంలోని ప్రధాన నూనెగింజ పంట అయిన ఆవాలు ధర ఈసారి రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం, ఆవాలు కొన్ని నగరాల్లో కనీస మద్దతు ధర కంటే...
భారతదేశంలోని ప్రధాన నూనెగింజ పంట అయిన ఆవాలు ధర ఈసారి రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం, ఆవాలు కొన్ని నగరాల్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముడవుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ .4650 ఉండగా, మండీలలో దీని రేటు క్వింటాల్‌కు రూ .5500 పలుకుతుంది. దీంతో, రైతులు ప్రభుత్వ మండీలలో విక్రయించకుండా.. నేరుగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలు రైతులకు కాస్త ఊరటనిస్తున్నాయి. మీరు కూడా ఆవాలు పండించడం ద్వారా ఎక్కువ లాభాలను సంపాదించాలనుకుంటే, సాంప్రదాయ పద్ధతికి దూరంగా వెళ్లి సేంద్రీయ పద్దతిన అవలంభిస్తే.. కనీస లాభాలు పొందుతారు.
ఆవపిండి సాగు ప్రధానంగా హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో జరుగుతుంది. కానీ ఆవ నూనెను దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వంటల కోసం వినియోగిస్తారు. ఆవ నూనెలో లభించే ఔషధ గుణాల కారణంగా, ఎల్లప్పుడూ మార్కెట్లో ఉంటుంది. ఆవ నూనెలో ఇతర తినదగిన నూనెలను కలపడాన్ని ప్రభుత్వం గతంలోనే నిషేధించింది.
సేంద్రీయ ఆవపిండి పండించడం ఎలా?
సేంద్రీయ ఆవపిండి సాగు… సాంప్రదాయ ఆవపిండి సాగుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. సేంద్రీయ ఆవపిండి సాగు కోసం, మొదట మీరు భూమిని దున్ని.. చదును చేయాలి. తరువాత, ఎకరా విత్తనాలకు 5 క్వింటాళ్ల చొప్పున వర్మి కంపోస్ట్ మిక్స్ చేయాలి. ఆపైన మొలకెత్తిన ఆవగింజలను రెండు, మూడు సార్లు నీటిలో ముంచి పొలంలో చల్లాలి. ఫంగస్‌ను నివారించడానికి ట్రైకోడెర్మాను ఉపయోగించవచ్చు. మీరు విత్తనాల ఎంపికపై ఫోకస్ పెట్టాలి. నాణ్యమైన విత్తనాల వాడితేనే అధిక దిగుబడి ఉంటుంది.
నీటిపారుదల, కలుపు తీయుట..
విత్తనాలు చల్లిన 20-25 రోజుల తరువాత పొలానికి నీళ్లు పెట్టాలి. పొలంలో కలుపు మొక్కలు కనిపిస్తే, ఆవపిండి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు వాటిని పీకివేయాలి. కలుపు తీయడం వల్ల మొక్కలు వేగంగా పెరుగుతాయి. దిగుబడి కూడా బాగా ఉంటుంది. చాలా మంది రెండుసార్లు కలుపు తీస్టారు. మీ పొలంలో కలుపు మొక్కలు ఎక్కవగా లేకపోతే, ఒకసారి తీసినా సరిపోతుంది.
పంట సిద్ధమైన తర్వాత ఏమి చేయాలి?
పంట సిద్ధమైన తర్వాత, మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. సాధారణంగా రైతులు ఆవాలును నేరుగా అమ్ముతారు. మీరు ఆవాలు అమ్మే బదులు ఆవ నూనెను అమ్మితే లాభం ఎక్కువ. సేంద్రీయంగా పండించిన ఆవ నూనెకు మంచి డిమాండ్ ఉంటుంది.
సేంద్రీయ వ్యవసాయాని ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. సేంద్రీయ వ్యవసాయం కారణంగా, రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతోంది. లాభాలు బాగుంటాయి. దీని వల్ల పర్యావరణం, నేలకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు కూడా ఆవపిండిని సాంప్రదాయ పద్ధతిలో ఇప్పటిదాకా పండిస్తే, ఒకసారి సేంద్రీయ పద్దతిలో ప్రయత్నించి మంచి లాాభాలు అందుకోండి.
ALso Read: ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. నేటితో స్కాలర్‌షిప్ దరఖాస్తుకు ముగియనున్న గడువు
ఊపిరి ఊదవయ్యా.. రామయ్యా..!.. ఏపీలో హాట్ టాపిక్‌గా తారక్ పొలిటికల్ ఎంట్రీ..