కట్టప్ప పాత్రకు ముందుగా ఆ నటుడు పేరు.. చివరికి సత్యరాజ్‎కి.. 

10 January 2025

Prudvi Battula 

బాహుబలి.. ఇండియాన్ సినిమాకి ఓ కొత్త బాట చూపించిన చిత్రం. తెలుగు సినిమా ఘనతని ప్రపంచానికి పరిచయం చేసింది.

రాజమౌళి దర్సకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కి తొలి 1000 కోట్లు కొట్టిన తెలుగు సినిమా. పాన్ ఇండియా పేరుతో సరిహద్దులు చెరిపేసిన మూవీ.

రాజమౌళి, ప్రభాస్‎తో పాటు రానా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, అనుష్క, తమన్నా లాంటివారి కృషితో బాహుబలికి అంతటి సక్సెస్ లబించింది.

ఇదిలా ఉంటె మహిస్మతి సామ్రాజ్య సింహాసనానికి కట్టు బానిస కట్టప్ప పాత్రలో సత్యరాజ్ తన నటనతో ఆకట్టుకున్నారు.

అయితే ఈ సినిమాలో ఈ పాత్ర కోసం మరో నటుడిని అనుకుంది మూవీ టీమ్. అయితే చివరకు ఈ పాత్రలో నటించే ఛాన్స్ సత్యరాజ్‎కి లభించింది.

ఈ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‎లో కట్టప్ప పాత్రను ముందు సంజయ్‌దత్‌ని ఊహించి రాసుకున్నారు రచయిత విజయేంద్రప్రసాద్‌.

ఆ సినిమా షూటింగ్ సమయానికి సంజయ్‌దత్‌ అందుబాటులో లేకపోవడంతో కట్టప్ప పాత్రకు సత్యరాజ్‌ని ఫిక్స్ చేసారు.

బాహుబలి స్క్రిప్ట్ ని నాలుగైదు నెలల్లో పూర్తి చేసినట్టు తెలిపారు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌.