Andhra Students: ఏపీ విద్యార్థులకు అలెర్ట్… నేటితో స్కాలర్‌షిప్ దరఖాస్తుకు ముగియనున్న గడువు
డిగ్రీ, ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధనారుసుముల దరఖాస్తు గడువును ఏపీ సర్కార్ మంగళవారం వరకు పొడిగించింది.
డిగ్రీ, ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధనారుసుముల దరఖాస్తు గడువును ఏపీ సర్కార్ మంగళవారం వరకు పొడిగించింది. ఈ నెల 28 వరకు లాస్ట్ డేట్ ఉండగా.. ప్రస్తుతం నర్సింగ్, పారా మెడికల్ కోర్సులకు కౌన్సెలింగ్ జరుగుతున్నందున దరఖాస్తు గడువును పొడిగించారు. స్కాలర్‌షిప్ కోసం సోమవారం సాయంత్రం వరకు 4,24,078 మంది స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకున్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ కోర్సుల్లో రెన్యువల్ కోసం మొత్తం 8,57,695 మంది అప్లై చేసుకున్నారు. దరఖాస్తుల్లో 90 శాతం వరకు పరిశీలన కంప్లీట్ అయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 10 శాతం దరఖాస్తుల పరిశీలన రెండ్రోజుల్లో పూర్తి చేసి.. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో సామాజిక తనిఖీ నిర్వహిస్తామని తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ సెంటర్స్ పెంపు
ఏపీలో కరోనా వ్యాప్తి ఇప్పుడు ఉధృతంగా ఉంది. దీంతో ప్రభుత్వం, విద్యా శాఖ అధికారులు అలెర్ట్ అయ్యారు. తాజాగా కరోనా నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ సెంటర్స్ పెంచారు. ఈ మేరకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం 905 సెంటర్స్ ఉండగా, ఈ ఏడాది 947కు పెంచినట్లు వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా మార్చి 31 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొత్తం 3,58,474 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్ లో అందుబటులో ఉంచారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్స్ జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో అధికారులు అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: విచిత్ర దొంగతనం.. ప్రభుత్వ వాహనం పార్ట్స్ మొత్తం లేపేశారు.. ఫార్మాలిటీకి బాడీ మాత్రం ఉంచారు
ఊపిరి ఊదవయ్యా.. రామయ్యా..!.. ఏపీలో హాట్ టాపిక్‌గా తారక్ పొలిటికల్ ఎంట్రీ..