AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Variety Theft: విచిత్ర దొంగతనం.. ప్రభుత్వ వాహనం పార్ట్స్ మొత్తం లేపేశారు.. ఫార్మాలిటీకి బాడీ మాత్రం ఉంచారు

ప్రభుత్వ వాహనాల్లో ఒకటీ- రెండు పార్ట్స్ మాయమవడం అక్కడక్కడా చూస్తుంటాం.. కానీ వాహనంలోని పార్టులన్నీ టైర్లు, సీట్లు, లైట్లతో సహా లూటీకి గురి కావడం ఎక్కడైనా చూశారా...?

Variety Theft: విచిత్ర దొంగతనం.. ప్రభుత్వ వాహనం పార్ట్స్ మొత్తం లేపేశారు.. ఫార్మాలిటీకి బాడీ మాత్రం ఉంచారు
Varity Theft
Ram Naramaneni
|

Updated on: Mar 30, 2021 | 8:57 AM

Share

ప్రభుత్వ వాహనాల్లో ఒకటీ- రెండు పార్ట్స్ మాయమవడం అక్కడక్కడా చూస్తుంటాం.. కానీ వాహనంలోని పార్టులన్నీ టైర్లు, సీట్లు, లైట్లతో సహా లూటీకి గురి కావడం ఎక్కడైనా చూశారా…? అచ్చం సినీ ఫక్కీలో జరిగిన ఆ చోరీని చూస్తే ఎలాంటి వారైనా అవాక్కవ్వాల్సిందే.

వాహనంపై ఉన్న పరికరాలన్ని మాయమై కేవలం బాడీ మాత్రమే కనిపిస్తున్న ఈ వాహనాన్ని చూస్తే ఏమనిపిస్తుంది.. ఖలేజా సినిమాలోని ఓ సన్నివేషం గుర్తుకు వస్తుంది కదూ.. రాజస్థాన్ ఎడారిలో కరువుతో విలవిలలాడుతున్న ప్రజలు కామెడియన్ అలీ వాహనాన్ని ఇలా పార్టులు పార్టులుగా పీక్కుపోతారు. సినిమా సీన్ ఇక్కడ నిజంగానే రిపీట్ అయింది.. ఆ సినిమాను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో..? ఇదిగో ఇలా ప్రభుత్వ వాహనంలో పార్టులన్నీ పీక్కుపోయారు… టైర్లు, లైట్లు, సీట్లు, బ్యాటరీ, స్టీరింగ్, స్టెపిన్ టైర్, టూల్ బాక్స్, పై కవర్ తో సహా అన్నీ మాయం చేశారు.

ఈ వింత చోరీ ఎక్కడో కాదు జరిగింది…మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందిన నర్సరీలో. నర్సరీ అవసరాల కోసం అటవీశాఖ అధికారులు టాటా ఏస్ వాహనాన్ని కొనుగోలు చేశారు. మొక్కలు, పనిముట్లు తీసుకురావడం, కూలీలను తరలించడం కోసం ఈ వాహనాన్ని ఉపయోగించే వారు. ప్రస్తుతం నర్సరీలో పనులు ఏమి లేక పోవడంతో వాహనాన్ని పక్కన పార్కింగ్ చేసి పెట్టారు. మరి ఇది ఇంటి దొంగల పనో లేక బయటి దొంగల పనో తెలియదు కానీ ఇలా లూఠీ చేశారు.. వాహనంలోని పార్ట్స్ అన్నీ మాయం చేశారు.వాహనం  అన్ని పార్ట్స్ మాయం అవడంతో ఫారెస్ట్ సిబ్బంది నోరెళ్ల బెట్టారు. ఉన్నతాధికారుల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read:  మట్టిలో మాణిక్యం మరోసారి మెరిసింది.. ఉసేన్ బోల్ట్‌ను దాటి ఎగసింది.. వారెవ్వా, శ్రీనివాసగౌడ

కరెంట్ షాక్ కొట్టి రామచిలుక మరణం.. ఉసూరుమన్న పక్షి ప్రేమికుడి మనసు.. ఏం చేశాడంటే..?