కరెంట్ షాక్ కొట్టి రామచిలుక మరణం.. ఉసూరుమన్న పక్షి ప్రేమికుడి మనసు… ఏం చేశాడంటే..?

జంతు ప్రేమికులు.. ఏ జంతువుకైనా, పక్షులకైనా చిన్న గాయం తగిలినా తట్టుకోలేరు. వారికే అయినంతగా బాధ పడిపోతుంటారు. అలాంటిది చనిపోతే..

కరెంట్ షాక్ కొట్టి రామచిలుక మరణం.. ఉసూరుమన్న పక్షి ప్రేమికుడి మనసు... ఏం చేశాడంటే..?
Parrot Creamation
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 30, 2021 | 9:03 AM

జంతు ప్రేమికులు.. ఏ జంతువుకైనా, పక్షులకైనా చిన్న గాయం తగిలినా తట్టుకోలేరు. వారికే అయినంతగా బాధ పడిపోతుంటారు. అలాంటిది చనిపోతే.. ఇంకెంత బాధగా ఉంటుంది. ఖమ్మం జిల్లాకు చెందిన రావుట్ల సత్యనారాయణ కూడా తట్టుకోలేకపోయాడు. ఓ రామ చిలుక తన కళ్లెదుటే విద్యుత్‌ హై టెన్షన్‌ వైర్లకు తగిలి గిలగిల కొట్టుకుని మృతిచెందింది. కళ్లెదుటే రామచిలుక చనిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు. అయ్యోపాపం అని చూసి వెళ్లిపోలేదు. ఎలాగైనా దాని రుణం తీర్చుకోవాలనుకున్నాడు. మనుషుల్లా రామచిలుకకు కూడా అంత్యక్రియలు నిర్వహించాలనుకుని.. అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టాడు. రామచిలుకకు సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించి రామభక్తిని చాటుకున్నాడు. ఇదే జిల్లాలో మేడేపల్లి నుండి కట్టకూరు వెళ్లే మార్గంలో ఓ రామ చిలుక కూడా ఇటీవల హఠాత్తుగా చెట్టు పై నుంచి కింద పడి మృతి చెందింది. దానికి కూడా స్థానిక రైతులు.. అంత్యక్రియలు జరిపించారు.

మనుషులతో కలసి ఈ భూమిపై జీవనం సాగిస్తున్న పశువులూ, పక్షులు చనిపోయిన సందర్భాల్లో బాధ కలుగుతుందని వారి అభిప్రాయం. అయితే రామ నామంతో ఉన్న రామచిలుక చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహిస్తే మంచిదనే భావన ఇక్కడి వారిలో ఉంది. దానికి అనుగుణంగానే ఏ చిలుకకు అపాయం జరిగినా ముందుంటున్నారు. తమ భాగ్యంగా భావిస్తున్నారు. రామచిలుకకు అంత్యక్రియలు నిర్వహించటం రామునికి సేవ చేసినట్లుగా ఉందన్నారు. మనపై ఆధారపడి జీవించే పశువులూ, పక్షులు మరణించిన సందర్భాల్లో వాటిని అలా వదిలేయకుండా సంప్రదాయపద్దతిలో సాగనంపితేనే మంచిదని అంటున్నారు. తోటి జీవుల పట్ల జాలిని చూపడమే కాదు.. పర్యావరణాన్నీ కాపాడేలా ముందుండాలని కోరుతున్నారు.

Also Read: వీళ్లు మామూలు పిల్లలు కాదు..జగత్‌ జంత్రీలు.. సైకిల్ కనిపిస్తే వదలరు…

ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ఎందుకు ధరిస్తారు? దీని వెనుక కారణం ఇదే

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!