AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Rides: ఎమ్మెల్యే కారు డ్రైవర్ నివాసంలో నోట్ల కట్టలు.. షాక్ అయిన ఐటీ అధికారులు.. లెక్కలడిగితే మాత్రం..

Tamil Nadu Elections 2021: తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది నోట్ల కట్టలు కుప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా అక్కడ..

IT Rides: ఎమ్మెల్యే కారు డ్రైవర్ నివాసంలో నోట్ల కట్టలు.. షాక్ అయిన ఐటీ అధికారులు.. లెక్కలడిగితే మాత్రం..
It Department Rides
Shiva Prajapati
|

Updated on: Mar 30, 2021 | 7:51 AM

Share

Tamil Nadu Elections 2021: తమిళనాట ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది నోట్ల కట్టలు కుప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా అక్కడ ఐటీ అధికారులు జరిపిన దాడిలో కోటి రూపాయల నగదు బయటపడింది. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఆర్. చంద్రశేఖర్ కారు డ్రైవర్ అలగర్‌స్వామి ఇంట్లో భారీ స్థాయిలో డబ్బు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఐటీ శాఖ అధికారులు.. అతని ఇంటిపై దాడి చేశారు. ఈ తనిఖీలో అధికారులు పెద్ద మొత్తంలో నగదును గుర్తించారు. సుమారు కోటి రూపాయల నగదును గుర్తించిన అధికారులు.. లెక్కలు చూపాలంటూ ఎమ్మెల్యే డ్రైవర్‌ను అడిగారు. ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.

ఎస్పీ జయచంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘సోమవారం రాత్రి చంద్రశేఖర్ అనుచరుడి నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడి చేసింది. చంద్రశేఖర్‌ వద్ద చాలా కాలంగా డ్రైవర్‌గా పనిచేస్తున్న వలసుపట్టికి చెందిన అలగర్‌స్వామి(38) ఇంటిపై జరిపిన దాడిలో సరైన పత్రాలు లేకుండా ఉంచిన కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 500 రూపాయల నోట్ల రూపంలో మొత్తం 20,000 నోట్లు ఉన్నాయి. వళసుపట్టికి చెందిన తంగపండియన్ (56), కొట్టైపట్టికి చెందిన ఆనంద్ (32) అలియాస్ మురుగనంతం ఇళ్లపై కూడా ఐటి శాఖ దాడులు చేసినప్పటికీ అక్కడ ఏమీ దొరకలేదు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని సమాచారం అందిన నేపథ్యంలో తిరుచ్చి ఆదాయపు పన్ను శాఖ కో-డైరెక్టర్ మదన్ కుమార్ నేతృత్వంలో అధికారులు మూడు బృందాలుగా విడిపోయిన మూడు ప్రదేశాలపై ఏకకాలంలో దాడులు చేశారు. ఓ మూడు కార్లలో అధికారులు మూడు గ్రూపులుగా విడిపోయి మూడు ప్రదేశాలపై విడిగా దాడి చేశారు.’ అని ఈ ఘటన తాలూకు వివరాలను వెల్లడించారు.

కాగా, తమిళనాడులోని తిరుచురాపల్లి జిల్లా పరిధిలో ఉన్న మనప్పరై నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఏఐఏడీఎంకే నేత ఆర్ చంద్రశేఖర్.. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుచుకున్నారు. అయితే, ఎన్నికల్లో భాగంగా ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు దాడులు చేశారు.

Also read:

Petrol Diesel Rates: దేశంలోని చాలా చోట్ల స్థిరంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు.. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలా…!

Karthika Deepam 1000 Episode: ఈరోజు ఉత్కంఠంగా మారిన కార్తీక్ దీపం .. దీప, పిల్లల వద్దకు చేరుకున్న డాక్టర్ బాబు