Congress leader Sad Story: అమ్మాయి పేరుతో అబ్బాయి, కేరళలో కాంగ్రెస్ అభ్యర్థి కన్నీటిగాథ..
కేరళలోని కైపమంగళం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న శోభా సుబిన్ ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. శోభా సుబిన్ అంటే మహిళా అభ్యర్థి అనుకునేరు..
కేరళలోని కైపమంగళం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న శోభా సుబిన్ ఇప్పుడు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారారు. శోభా సుబిన్ అంటే మహిళా అభ్యర్థి అనుకునేరు.. కాదు మిస్టర్ శోభా సుబినే! పాపం ఈ పేరు కారణంగానే ఆయన పది మందికి తాను అమ్మాయిని కాదని చెప్పుకోవలసి వస్తున్నది.. మరి ఆ పేరు ఆయన ఎందుకు పెట్టుకున్నట్టు అంటే అది ఆయన అమ్మ పేరు! మాతృమూర్తి గుర్తుగా ఆ పేరు పెట్టుకున్నాడు.
త్రిసూర్ జిల్లాలో ఉంటుంది కైపమంగళం నియోజకవర్గం.. ఎమ్మెల్యేగా పోటీ చేయడం శోభా సుబిన్‌కు ఇది మొదటిసారి! అలాగని రాజకీయాలకు కొత్తేమీ కాదు. త్రిసూర్ కలెక్టరేట్ శ్రీమతి శోభా సుబిన్ అంటూ సంబోధిస్తే.. ‘నేను శోభా సుబిన్‌నే. కాకపోతే మిస్టర్ శోభా సుబిన్‌ను అని సమాధానం ఇచ్చుకోవలసి వచ్చింది’ అని ఆయన చెప్పుకొచ్చారు. యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ పదవిలో ఉన్న శోభా ఎనిమిది నెలల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. పొగొట్టుకోవడం కాదు తండ్రే భార్యను చంపేశాడు. తల్లి మరణం, హత్యానేరం కింద తండ్రి అరెస్ట్ కావడంతో శోభా అనాథ అయ్యారు. బాబాయ్ సుబ్రమణియన్ ఎనిమిది నెలల శోభను అక్కున చేర్చుకున్నారు. కొన్నేళ్లు అయ్యాక పాలప్పెట్టీ లోని ఎస్‌ఎన్‌ఎస్ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో చేర్పించడానికి వెళ్లారు సుబ్రమణియన్.. అక్కడ టీచర్ కూడా ఇదే ప్రశ్న వేశారు. మగబ్బాయికి ఈ పేరేమిటని! ఎనిమిది నెలల ప్రాయంలో తల్లిని పోగొట్టుకున్నాడు కాబట్టి తల్లి పేరునే ఇతడికి పెట్టామని జవాబిచ్చాడు సుబ్రమణియన్. స్కూల్‌లో తోటి పిల్లలు శోభా సుబిన్‌ను ఏడిపించేవారు. ఎకసెక్కాలు చేసేవారు. ‘తల్లిదండ్రులు లేరు, పేరేమో ఆడపిల్ల పేరు. ఒంటరిగా గట్టిగా
ఏడ్చేవాడిని.. నాకు నా పేరంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది నా అమ్మపేరు కాబట్టి. నన్ను శోభ అనే పిలవాలని నా మిత్రులకు నిర్మోహమాటంగా చెప్పేవాడిని. అలా వారు పిలిచినప్పుడల్లా అమ్మ నా చెంత ఉన్నట్టే అనిపించేది’ అని శోభా సుబిన్ చెప్పారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి పెరిగి పెద్దయ్యాడు శోభా సుబిన్.. చిన్నమ్మ ఒమన నలుగురి ఇంట్లో పనులు చేసి నాలుగు డబ్బులు గడించేది. ఆమె చెంతనే శోభ పెరిగాడు. శోభ కోసమే ఆమె పెళ్లి చేసుకోలేదు. ఇద్దరూ అది ఇది అన్న తేడా లేకుండా అన్ని పనులూ చేశారు. వంట పని చేశారు. చేపలమ్మారు. బరువులు మోశారు. పడవలు నడిపారు. చేపలు పట్టారు.. ఇలా అన్ని పనులూ చేశారు. ఆ డబ్బులతోనే శోభా సుబిన్ చదువుకున్నాడు. న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. దేశం కానీ దేశంలో మూడేళ్లు పని చేశాడు. ఆ తర్వాత స్వదేశానికి వచ్చి రాజకీయాల్లో చేరాడు. స్కూల్‌లో తన క్లాస్‌మెట్ కె.ఎమ్.రేష్మాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారికి ఏడు నెలల బాబు కూడా! మూడో తరగతి చదువుతున్నప్పుడు శోభను చూడటానికి పరోల్ మీద తండ్రి వచ్చాడు. కొడుకును మచ్చిక చేసుకోడానికి పది రూపాయలు ఇచ్చాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ ఆ పది రూపాయలను లాగేసుకుని పొయ్యిలో వేసింది. ‘శోభను గట్టిగా కౌగిలించుకుని నీకు అమ్మ నాన్నా ఇద్దరూ లేరు.. ఆ విషయం మర్చిపోవద్దు’ అంటూ కన్నీరు కార్చింది. శోభను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కారణం ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తనేంటో రుజువు చేసుకున్నారు కాబట్టి. సీపీఎం బలంగా ఉన్న చోట శోభా సుబిన్ 387 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించుకోగలిగారు. తాను ఈ స్థాయికి వచ్చానంటే అది ప్రజల మంచితనం వల్లేనని వినమ్రంగా చెపుతారు శోభా. గెలిస్తే నిస్వార్థంగా, అంకిత భావంతో పని చేస్తానని అంటున్నారు.. మరిన్ని చదవండి ఇక్కడ : చైనాలో అద్భుతం.. వంగిపోయిన గ్లాస్ బ్రిడ్జి..విస్తుపోతున్న ప్రేక్షకులు( వీడియో ) : Glass Bridge Video. పెరిగిన బంగారం ధర..వెండి కిందకు..( వీడియో ): Gold Silver Price Today Video. థియేటర్ లో పవన్ మానియా హల్ చల్ చేస్తున్న ఫాన్స్..( వీడియో ) : Vakeel Saab trailer release video