Joyce George on Rahul : రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లొద్దు, అతనికసలే పెళ్లి కాలేదు: అమ్మాయిలకు కేరళ మాజీ ఎంపి వార్నింగ్

Joyce George on Rahul gandhi : 'రాహుల్ గాంధీ అసలే పెళ్లికానివాడు.. తన దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి' అని విద్యార్థినిలను..

Joyce George on Rahul :  రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లొద్దు, అతనికసలే పెళ్లి కాలేదు: అమ్మాయిలకు కేరళ మాజీ ఎంపి వార్నింగ్
Joyce George On Rahul Gandh
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 30, 2021 | 8:10 PM

Joyce George on Rahul gandhi : ‘రాహుల్ గాంధీ అసలే పెళ్లికానివాడు.. తన దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని విద్యార్థినిలను హెచ్చరించారు కేరళ మాజీ ఎంపీ జాయిస్ జార్జ్. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఐ (ఎం) నాయకుడు, ప్రస్తుత విద్యుత్ మంత్రి ఎంఎం మణికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాజీ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేనా.. “రాహుల్ గాంధీ కార్యక్రమాలు మహిళా కాలేజీలలో మాత్రమే జరుగుతాయి. అతను అక్కడికి వెళ్లి అమ్మాయిలకు ఎలా నిలబడాలి, ఎలా వంగాలి అని నేర్పుతాడు. సో.. నా ప్రియమైన పిల్లలు, అతని దగ్గరకు వెళ్లి ఇలాంటి పనులు చేయకండి … అతను వివాహం చేసుకోలేదు” అంటూ వివాదాస్పద, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు జాయిస్ జార్జ్.

కాగా, గత సోమవారం కొచ్చిలోని సెయింట్ తెరెసా కళాశాలలో రాహుల్ గాంధీ విద్యార్థినిలతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ దేశంలో ఆడవాళ్లకి రక్షణ లేకుండా పోయిందని.. రోజూ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని రాహుల్ అన్నారు. వీటి నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో చెబుతూ జపనీస్ మార్షల్ ఆర్ట్ ఐకిడో పాఠాలు చెప్పారు రాహుల్. ఎవరైనా దాడి చేస్తే ఎలా ప్రతిఘటించాలో, తమను తాము ఎలా రక్షించుకోవాలో అమ్మాయిలతో ప్రాక్టికల్ గా చేయించి చూపారు రాహుల్.

ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ జాయిస్ జార్జి రాహుల్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అయితే, జాయిస్ జార్జి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలా జార్జిపై మండిపడ్డారు. రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జార్జ్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, మహిళలను అవమానించినందుకు మాజీ ఎంపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మహిళా విభాగం కేరళ సచివాలయం ముందు ఇవాళ నిరసన చేపట్టింది. ఆడవాళ్లని అవమానించి.. రాహుల్ పై నీచమైన వ్యాఖ్యలు చేసిన జార్జిని వెంటనే అరెస్టు చేయాలని నిరసన ప్రదర్శన జరిపింది. కాగా, 140 మంది సభ్యులు గల కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6 న ఒకే దశలో పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 2 న జరుగుతుంది.

Read also : US Navy sing Hindi song : అమెరికా నేవీ హిందీ పాట ఆలపించిన అరుదైన సంఘటన, వైరల్ అవుతోన్న వీడియో