Miss You OTT: పుష్ప 2 ప్రభంజనంలో గల్లంతైన ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలో.. ఎక్కడ చూడొచ్చంటే?

లవర్ బాయ్ సిద్ధార్థ్, లేటెస్ట్ సెన్సేషన్ ఆషికా రంగనాథ్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా మిస్ యూ. అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలైన సరిగ్గా వారం రోజుల తర్వాత ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ థియేటర్లలోకి వచ్చింది. కానీ పుష్ప 2 ప్రభంజనంలో నిలవలేకపోయింది.

Miss You OTT: పుష్ప 2 ప్రభంజనంలో గల్లంతైన ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలో.. ఎక్కడ చూడొచ్చంటే?
Miss You Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2025 | 10:43 AM

చాలా రోజుల తర్వా సిద్ధార్థ్‌ నటించిన ప్రేమకథా చిత్రం మిస్ యూ. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఎన్‌.రాజశేఖర్‌ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అప్పటికే కొనసాగుతోన్న పుష్ప 2 ప్రభంజనం ముందు నిలవలేకపోయింది. సిద్ధార్థ్, ఆషికల జోడికి మంచి పేరొచ్చినా ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. దీంతో మిస్ యూ సినిమా ఓ మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. మిస్ యూ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జనవరి 10) అర్ధరాత్రి నుంచి సిద్ధార్థ్ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

7 మైల్స్ పర్ సెకెండ్ బ్యానర్ పై తమిళ్ నిర్మాత సామ్యూల్ మాథ్యూ మిస్ యూ సినిమాను నిర్మించారు. కరుణాకరన్, బాల శరవణన్, సభా మారన్, జయ ప్రకాశ్, పొన్నవన్, ఆడుకలం నరేన్, అనుపమా కుమార్ తదితరులు ఈ సినిమాలో నటించారు. గిబ్రాన్ స్వరాలు సమకూర్చారు. తొలి చూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడిన హీరో జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకోబోయే సమయంలో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అనే పాయింట్ లో ఈ సినిమా సాగుతుంది. మరి థియేటర్లలో మిస్ యూ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. రొమాంటిక్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఛాయిస్.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

మిస్ యూ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..