AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Powered Car: అద్భుతం.. సోలార్‌ కారును తయారు చేసిన రైతు.. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 300 కిలోమీటర్లు..

Solar Powered Car: కొందరు సొంత తేలివి తేటలతో తమ ప్రతిభను చూటుతున్నారు. ఒడిశాకు చెందిన ఓ రైతు సొంతంగా సోలార్‌ కారును తయారు చేసి అందరిని ఆశ్యర్యపరుస్తున్నాడు...

Solar Powered Car: అద్భుతం.. సోలార్‌ కారును తయారు చేసిన రైతు.. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 300 కిలోమీటర్లు..
Subhash Goud
|

Updated on: Mar 14, 2021 | 6:16 PM

Share

Solar Powered Car: కొందరు సొంత తేలివి తేటలతో తమ ప్రతిభను చూటుతున్నారు. ఒడిశాకు చెందిన ఓ రైతు సొంతంగా సోలార్‌ కారును తయారు చేసి అందరిని ఆశ్యర్యపరుస్తున్నాడు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల వరకు నడుస్తుందని చెబుతున్నాడు. మయూర్‌భంజ్‌లోఇన కరంజియాకు చెందిన సుశీల్ అగర్వాల్‌ లాక్‌డౌన్‌ సమయంలో తన ఇంటి వద్ద సోలార్‌ కారు తయారీకి శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రికల్‌ ఫిట్టింగ్స్‌,మోటార్‌ వైండింగ్‌, ఫ్రేమ్‌లు సహా అన్నింటిని సొంతంగా చేసుకున్నాడు. అయితే ఆ రైతు స్నేహితుడి సలహాలు, ఇద్దరు మెకానిక్స్‌ సహాయంతో మూడు నెలల కిందట దీనిని పూర్తి చేశాడు. అయితే ఇంకా ఫ్రేమ్‌లు బిగించాల్సి ఉంది. కాగా, ఈ సోలార్‌ కారు బ్యాటరీ పూర్తిగా చార్జ్‌ అయ్యేందుకు ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుందని సుశీల్‌ అగర్వాల్‌ తెలిపారు. మెల్లమెల్లగా చార్జ్‌ అయ్యే ఈ బ్యాటరీ పది సంవత్సరాల పాటు పని చేస్తుందని పేర్కొంటున్నాడు. ఒక్కసారి చార్జ్‌ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ఈ కారు ప్రయాణించగలని చెప్పాడు.

లాక్‌డౌన్‌ అనంతరం పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయని, ఎలాగైన ఎలక్ట్రికల్‌ వాహనం తయారు చేయాలని భావించి,యూట్యూబ్‌ ద్వారా తెలుసుకుని సోలార్‌తో నడిచే కారును సొంతంగా తయారు చేసుకున్నట్లు తెలిపాడు. ఇలాంటి వాటిని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు ప్రోత్సహించాలని, రోడ్డుపై నడిపేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు.

న్యూ ఐడియాస్‌ ఇన్వెన్షన్‌పై ఓ వర్క్‌ షాప్‌ ద్వారా ఆలోచన

కాగా, తాను ఉండే ఏరియాలోనే న్యూ ఐడియాస్‌ ఇన్వెన్షన్‌పై ఓ వర్క్‌ షాప్‌ జరిగింది. ఆ సమావేశానికి హాజరైన సుశీల్‌, అక్కడ పరిచయమైన మెకానిక్స్‌ సాయంతో వెహికల్‌ తయారీ ప్రారంభించాడు. 850 వాట్ల మోటారుతో పాటు 54 వోల్ట్‌ల బ్యాటరీ, ఇతర పరికరాలు ఒక్కొక్కటిగా అసెంబుల్‌ చేస్తూ వచ్చాడు. ఇలా వర్క్‌ చేస్తున్న క్రమంలో వెహికల్‌ పార్ట్స్‌ గురించి వివరాలు తెలుసునేందుకు సొంతంగా బుక్స్‌ చదవడంతో పాటు యూట్యూట్‌ వీడియోలు చూశాడు. ఈ విధంగా సోలార్‌ కారు తయారీ కోసం ఈ విధంగా మొత్తం 8 నెలల పాటు శ్రమించి ఎట్టకేలకు వెహికల్ రూపొందించాడు. అయితే ఇందులో బ్యాటరీ, సౌరశక్తి ద్వారా చార్జ్‌ అవుతుండటం గమనార్హం.

అయితే భవిషత్తులో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ముందని ,తాను లాక్‌డౌన్‌ కాలంలోనే ఊహించానని, అందుకే సొంతంగా వాహనం తయారీకి సిద్ధమయ్యానని చెబుతున్నాడు. వాహనం పైభాగంలో ఉండే సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా చార్జ్‌ అయ్యే ఈ వాహనాన్ని చూసి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవీ చదవండి: Goolgle Maps: గూగుల్‌ మ్యాప్స్‌లో మరో కొత్త ఫీచర్‌… ఇకపై మీరూ మ్యాప్స్‌ను ఎడిట్‌ చేయొచ్చు..

Visa Free Entry : భారతీయులకు బంపర్ ఆఫర్.. వీసా లేకుండా 16 దేశాల్లో తిరగొచ్చు.. ఎలాగో తెలుసా