Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Usage: ప్రజలు మొబైల్‌ను తెగ వాడేస్తున్నారు.. ఈ విషయంలో అమెరికా కంటే మనమే టాప్.. మన దేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందంటే..

టెక్నాలజీ ప్రపంచంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నడూ లేనంత వేగంతో ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేస్తోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల టెక్నాలజీ ప్రతిరోజూ మార్పులకు లోనవడమే కాకుండా.. ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తోంది.

Mobile Usage: ప్రజలు మొబైల్‌ను తెగ వాడేస్తున్నారు.. ఈ విషయంలో అమెరికా కంటే మనమే టాప్.. మన దేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందంటే..
Mobile Usage
Follow us
KVD Varma

|

Updated on: Jul 26, 2021 | 11:16 AM

Mobile Usage: టెక్నాలజీ ప్రపంచంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నడూ లేనంత వేగంతో ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేస్తోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల టెక్నాలజీ ప్రతిరోజూ మార్పులకు లోనవడమే కాకుండా.. ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేస్తోంది. దీంతో మొబైల్ ఫోన్ల వాడకం ఇబ్బడిముబ్బడిగా  పెరిగిపోయింది.అంతేకాదు.. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో చదువుల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా అన్నీ ఇంటి నుంచే సాగాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల కచ్చితంగా అందరికీ మొబైల్ చేతిలో ఉండాల్సి వచ్చింది. దీంతో ప్రతి ఐటీలోనూ పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరి దగ్గరా మొబైల్ ఫోన్ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. ప్రపపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్ల వాడకం ఎంత పెరిగిపోయింది అనేదానిపై ఇటీవల ఒక సర్వే నిర్వహించారు.. మన దేశంతో సహా వివిధ దేశాల్లో జరిపిన ఈ సర్వే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఇప్పటి ప్రపంచంలో మొబైల్ ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిందనేది ఈ సర్వేలో స్పష్టం అయింది. అసలు ప్రజలు కొన్ని పనులను మొబైల్ లేకుండా చేయలేని పరిస్థితులూ ఉన్నాయి.  ఇక మొబైల్ వాడకం గురించి చూస్తే కనుక భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. భారత ప్రజలు రోజువారీ సగటున 4 గంటలకు పైగా మొబైల్ ఉపయోగిస్తున్నారు.

బ్రెజిలియన్లు ఎక్కువగా..

జెడ్‌నెట్ న్యూస్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం, బ్రెజిలియన్లు ప్రపంచంలో అత్యధిక మొబైల్‌లను ఉపయోగిస్తున్నారు. బ్రెజిల్ ప్రజలు రోజువారీ సగటున 5 గంటల 4 నిమిషాలు మొబైల్ ఉపయోగిస్తారు. ఇండోనేషియా పేరు  ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఈ దేశం ప్రతిరోజూ 5 గంటల 3 నిమిషాలు మొబైల్‌లో గడుపుతుంది. నివేదికలో 4 గంటల 9 నిమిషాల మొబైల్ వాడకంతో భారతదేశం మూడవ స్థానంలో నిలిచింది.

ఈ నివేదికలో 10 దేశాలను చేర్చారు.  నివేదిక ప్రకారం, దక్షిణ కొరియాకు 7 ఇతర దేశాల ర్యాంకులో నాల్గవ సంఖ్య లభించింది. దక్షిణ కొరియన్లు ప్రతిరోజూ 4 గంటలు 8 నిమిషాలు మొబైల్‌లను ఉపయోగిస్తున్నారు. 4 గంటల 7 నిమిషాల మొబైల్ వాడకంతో మెక్సికో 5 వ స్థానంలో ఉంది. టర్కీ 4 గంటల 5 నిమిషాలతో 6 వ స్థానంలో, 4 గంటల 4 నిమిషాలతో జపాన్ 7 వ స్థానంలో, 4 గంటల 1 నిమిషంతో కెనడా 8 వ స్థానంలో, యుఎస్ 3 గంటల 9 నిమిషాల మొబైల్ సరాసరి వాడకంతో 9వ స్థానంలోనూ, యుకె 3 గంటల 8 నిమిషాల వాడకంతో 10 వ స్థానంలో ఉంది.

Also Read: VIRAL PHOTOS : ప్రపంచంలోని ఈ 5 ప్రమాదకర స్థలాల్లో ప్రజలు నివసిస్తున్నారు..! ఏంటో తెలుసుకోండి..

Smart Phone usage: తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్.. స్మార్ట్‌ఫోన్‌తో మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా?