AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart Phone usage: తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్.. స్మార్ట్‌ఫోన్‌తో మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా?

పిల్లల మొబైల్ వినియోగంపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్) ఒక అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి.

Smart Phone usage: తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్.. స్మార్ట్‌ఫోన్‌తో మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా?
Smart Phone Usage
KVD Varma
|

Updated on: Jul 26, 2021 | 9:48 AM

Share

Smart Phone usage: పిల్లల మొబైల్ వినియోగంపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్‌సిపిసిఆర్) ఒక అధ్యయనం చేసింది. స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న పిల్లల్లో 59.2% మంది పిల్లలు మెసేజింగ్ యాప్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారని ఈ అధ్యయనం తేల్చింది. కేవలం  10.1% మంది పిల్లలు మాత్రమే ఆన్‌లైన్ అభ్యాసం లేదా చదువుకు సంబంధించిన విషయాల కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. అధ్యయనం ప్రకారం, దేశంలో 30.2% మంది పిల్లలు తమ సొంత స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్నారు. పదేళ్ల పిల్లలలో 37.8% మందికి ఫేస్‌బుక్ ఖాతా ఉంది. ఒకే వయస్సు గల పిల్లలలో 24.3% మందికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. 13 సంవత్సరాల తర్వాత పిల్లలు తమ సొంత స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకునే ధోరణి పెరుగుతోందని అధ్యయనం చెబుతోంది. ఏదేమైనా, ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ల్యాప్‌టాప్‌లు / టాబ్లెట్‌లను ఉపయోగించే పిల్లల సంఖ్య అన్ని వయసుల వారికీ స్థిరంగా ఉంటుంది. ల్యాప్‌టాప్‌లు లేదా టాబ్లెట్ల కంటే తల్లిదండ్రులు 12-13 సంవత్సరాల వయస్సు తర్వాత పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇవ్వడానికి ఇష్టపడతారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

ఈ అధ్యయనంలో మొత్తం 5,811 మంది పాల్గొన్నారు . వీరిలో 6 రాష్ట్రాల్లోని 60 పాఠశాలలకు చెందిన 3,491 మంది పాఠశాల పిల్లలు, 1,534 మంది తల్లిదండ్రులు, అదేవిధంగా, 786 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో దేశంలోని అన్ని ప్రాంతాల (తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఈశాన్య) ప్రజలు ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 15 ప్రదేశాలు ఈ అధ్యయనం కోసం తీసుకున్నారు.  ఒక ప్రాంతానికి చెందిన సుమారు 1,000 మందిని ఇందులో చేర్చారు.

తరగతిలో స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించడం అనే అధ్యయనంలో 72.70% మంది ఉపాధ్యాయులకు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించిన అనుభవం లేదు. తరగతి మొత్తంలో స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించడం ఇబ్బందికరంగా ఉంటుందని సుమారు 54.1% మంది అభిప్రాయపడ్డారు.

నిద్రలేమి సమస్యలు..

ఈ అధ్యయనంలో 8 – 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారు. వారి సగటు వయస్సు 14 సంవత్సరాలు. వయస్సు, సోషల్ మీడియా ఖాతాల మధ్య బలమైన సంబంధం ఉందని ఇది వెల్లడించింది. అధ్యయనం ప్రకారం, పిల్లలు నిద్రపోయే ముందు మొబైల్ వాడటం వల్ల నిద్రలేమి, ఆందోళన, అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.

పిల్లల ఇంటర్నెట్ వ్యసనాన్ని గుర్తించాలి..

తల్లిదండ్రులు పిల్లల ఇంటర్నెట్ వ్యసనాన్ని తల్లిదండ్రులు ముందుగా గుర్తించాలని ఎయిమ్స్ వైద్యులు సూచిస్తున్నారు. దీని కోసం, వారి పర్యవేక్షణ అవసరం. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర నైపుణ్యాలు నేర్చుకోవాలని ప్రోత్సహించాలి.

Also Read: Watermelon : చర్మ సంరక్షణ కోసం పుచ్చకాయ..! ఈ విధంగా వాడితే కాంతివంతమైన ముఖం మీ సొంతం..

ఇండియాలో ఈ ముగ్గురు బిచ్చగాళ్లు ధనవంతులు..! కోట్లాది ఆస్తి, బిల్డింగ్స్, బ్యాంక్ బ్యాలెన్స్..