ఇండియాలో ఈ ముగ్గురు బిచ్చగాళ్లు ధనవంతులు..! కోట్లాది ఆస్తి, బిల్డింగ్స్, బ్యాంక్ బ్యాలెన్స్..
Beggars : దేశంలోని పలు నగరాల్లోని సిగ్నల్ పాయంట్స్, బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్, చౌరస్తాలో మనం చాలామంది బెగ్గర్స్‌ని చూస్తూ ఉంటాం.
Beggars : దేశంలోని పలు నగరాల్లోని సిగ్నల్ పాయంట్స్, బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్, చౌరస్తాలో మనం చాలామంది బెగ్గర్స్‌ని చూస్తూ ఉంటాం. వారు పొట్టకూటి కోసం యాచిస్తూ కనిపిస్తారు. దీంతో చాలామంది ఎంతోకొంత డబ్బులు, ఆహారం అందిస్తూ మానవత్వాన్ని చాటుతుంటారు. దేశవ్యాప్తంగా చాలామంది బిచ్చగాళ్లు ఉన్నారు. ఇందులో కొంతమంది అంటే వన పర్సంట్ యాచించడం బిజినెస్‌గా మార్చుకున్నారు. వీరి సంపాదన తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. అడుక్కుంటూ ఇంత సంపాదించారా అంటూ ముక్కున వేలేసుకుంటారు. ఇంత సంపాదించినా వారు ఇప్పటికీ యాచిస్తూనే ఉంటారు. అలా దేశంలో ధనవంతులైన ముగ్గురు బిచ్చగాళ్ల గురించి తెలుసుకుందాం.
భారతదేశపు ధనవంతులైన బిచ్చగాళ్ల గురించి తెలుసుకుంటే అందరు షాక్ అవుతారు. వీరికి ధనవంతులలాగే అన్ని సౌకర్యాలు ఉంటాయి. వారు కూడా పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉంటారు. కానీ ఇప్పటికీ వీధుల్లో యాచిస్తూ ఉంటారు. దేశంలోని ధనిక బిచ్చగాళ్ల జాబితాలో మొదటి పేరు భారత్ జైన్. ఇతడు ఎక్కువగా ముంబైలోని పరేల్ ప్రాంతంలో యాచిస్తారు. నివేదిక ప్రకారం అతని వద్ద రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి ధర రూ.70 లక్షలు. యాచించడం ద్వారా ప్రతి నెలా సుమారు 75,000 రూపాయలు సంపాదిస్తాడు.
భారతదేశంలోని ధనిక బిచ్చగాళ్ల జాబితాలో రెండో నెంబర్ కోల్‌కతాలో నివసించే లక్ష్మి. ఈమె1964 నుంచి అంటే 16 సంవత్సరాల వయసులో కోల్‌కతాలో యాచించడం ప్రారంభించింది.50 సంవత్సరాలకు పైగా భిక్షాటన ద్వారా లక్షల రూపాయలు సేకరించింది. నేటికీ లక్ష్మి యాచన ద్వారా ప్రతిరోజూ వెయ్యి రూపాయలు సంపాదిస్తుంది. ముంబైలో నివసిస్తున్న గీతా కూడా గొప్ప బిచ్చగాళ్ల జాబితాలోకి వస్తుంది. ముంబైలోని చార్ని రోడ్ వద్ద గీత యాచిస్తూ ఉంటుంది. ఆమెకు సొంత ఫ్లాట్ ఉందని, ఆమె తన సోదరుడితో కలిసి నివసిస్తుందని చెబుతారు. గీత యాచించడం ద్వారా ప్రతిరోజూ సుమారు 15 వందల రూపాయలు సంపాదిస్తుంది.