AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL VIDEO : ప్రపంచంలో తల్లికి మించిన యోధులు మరెవరు లేరు..! ఐదు పిల్లలు పడిపోకుండా గోడపై నడుస్తున్న ఒపోసమ్

VIRAL VIDEO : ప్రపంచంలో తల్లికి మించిన యోధులు ఎవరు లేరని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు అది అక్షరాల నిజం. ఎందుకంటే

VIRAL VIDEO : ప్రపంచంలో తల్లికి మించిన యోధులు మరెవరు లేరు..! ఐదు పిల్లలు పడిపోకుండా గోడపై నడుస్తున్న ఒపోసమ్
Opossum
uppula Raju
|

Updated on: Jul 26, 2021 | 8:38 AM

Share

VIRAL VIDEO : ప్రపంచంలో తల్లికి మించిన యోధులు ఎవరు లేరని ఓ సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు అది అక్షరాల నిజం. ఎందుకంటే తల్లి ప్రేమ ముందు ఏదైనా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక తల్లి తన పిల్లల కోసం ఎన్ని బాధలనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది. తన జీవితంలో ఆనందం, దుఖం గురించి పట్టించుకోకుండా పిల్లల సంతోషం కోసం ఆరాటపడుతుంది. వారి సంతోషంలో ఆనందాన్ని వెతుకుంటుంది. సోషల్ మీడియాలో తల్లి ప్రేమను చూపించే ఎన్నో వీడియోలు ఉన్నాయి. అవి ఎప్పటికి ప్రేక్షకుల మనసులను దోచుకుంటాయి. తాజాగా ఓపోసమ్ జంతువు ఒకటి తన 5మంది పిల్లలతో గోడపై నడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. అదేంటో తెలుసుకుందాం.

ఈ వీడియోలో ఓపోసమ్ జంతువు తన ఐదు పిల్లలతో గోడపై నడుచుకుంటూ నెమ్మదిగా వెళుతుంది. పిల్లలన్ని తల్లి ఒపోసమ్‌ను వెనుక భాగంలో గట్టిగా పట్టుకొని ఉంటాయి. అయితే పిల్లలు కిందపడకుండా ఒపోసమ్‌ గోడపై నడిచే తీరు పలువురిని ఆకట్టుకుంటుంది. ఎంత కష్టమైనా బ్యాలెన్స్ తప్పకుండా ఒపోసమ్‌ గోడపై నడుస్తుంది. ఒక్క బిడ్డను కూడా వదిలించుకోదు. దీన్ని చూసిన నెటిజన్లు తల్లి ప్రేమ ఎక్కడైనా ఒకటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆమె శీర్షికలో, ‘కొన్నిసార్లు మాతృత్వం శక్తి సహజ చట్టాల కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ తల్లి ఒపోసమ్ వీడియోను సోషల్ మీడియాలో ప్రజలు తెగ ఇష్టపడుతున్నారు. ప్రజలు దీన్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Karthika Deepam Serial: స్టాఫ్ తో బయటకు గెంటించేస్తా.. దీప వార్నింగ్! అంజి మిస్సింగ్..మలుపు తిరిగిన మోనిత కథ!!

Camera For Blind: అంధుల కోసం ప్రత్యేక కెమెరా రూపొందించిన అమెరికా శాస్ర్తవేత్తలు.. ముందుగానే అలర్ట్‌ చేసే వ్యవస్థ.

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో భారీ తగ్గింపుతో స్మార్ట్‌ఫోన్లు..!