Watermelon : చర్మ సంరక్షణ కోసం పుచ్చకాయ..! ఈ విధంగా వాడితే కాంతివంతమైన ముఖం మీ సొంతం..

Watermelon : వేసవిలో పుచ్చకాయ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అధిక నీటి శాతం ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా

Watermelon : చర్మ సంరక్షణ కోసం పుచ్చకాయ..! ఈ విధంగా వాడితే కాంతివంతమైన ముఖం మీ సొంతం..
Watermelon
Follow us
uppula Raju

|

Updated on: Jul 26, 2021 | 9:36 AM

Watermelon : వేసవిలో పుచ్చకాయ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అధిక నీటి శాతం ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పని చేస్తుంది. ఇది మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది చర్మానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

1.చర్మ సంరక్షణ కోసం పుచ్చకాయ రసాన్ని వాడండి – పుచ్చకాయ తాజా ముక్కలను గ్లైండర్‌లో వేసి జల్లెడ పట్టి గుజ్జు తీయండి. పుచ్చకాయ రసం తీసుకొని దూది సహాయంతో ముఖం, మెడపై రాయండి. 20-30 నిమిషాలు ఆరిన తరువాత సాదా నీటితో కడగాలి. ప్రతిరోజూ చేయవచ్చు. వేసవిలో చర్మ సంరక్షణ కోసం పుచ్చకాయను ఉపయోగించడానికి ఇది గొప్ప మార్గం. పుచ్చకాయ రసం చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలను తొలగిస్తుంది. కళ్ళ చుట్టూ పుచ్చకాయ రసం పూయడం వల్ల అలసిపోయిన కళ్ళకు ఉపశమనం లభిస్తుంది.

2. కలబంద జెల్, పుచ్చకాయ – ఒక కప్పు తాజా పుచ్చకాయ క్యూబ్స్ తీసుకొని గ్లైండర్‌లో వేసి గుజ్జు రసం తీయండి. పుచ్చకాయ రసం, కలబంద జెల్ సమాన మొత్తంలో కలపండి. ముఖం, మెడ అంతా అప్లై చేసి మంచినీటితో కడగడానికి ముందు 30 నిమిషాలు ఆరనివ్వండి. వారానికి రెండుసార్లు చేయవచ్చు. పుచ్చకాయను ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది.

3. పుచ్చకాయ, తేనె – టాన్‌ తొలగించడానికి ఇది గొప్ప సహజ నివారణ. ఒక గిన్నెలో 2 టీస్పూన్ల పుచ్చకాయ గుజ్జు తీసుకొని దానికి 2 టీస్పూన్ల ముడి తేనె కలపండి. ఇప్పుడు ఫేస్ మాస్క్ ను సిద్ధం చేయండి. ముఖంతో పాటు మెడ మొత్తం రాయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత మంచినీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయవచ్చు.

4. పుచ్చకాయ, అవోకాడో – ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల తాజా పుచ్చకాయ గుజ్జు తీసుకోండి. ఒక అవోకాడోను సగానికి కట్ చేసి, విత్తనాలు తీసివేసి ఒక గిన్నెలో వేయండి. ఈ మిశ్రమాన్ని మెత్తగా చేసి పుచ్చకాయ గుజ్జుతో కలపాలి. ముఖంతో పాటు మెడ మొత్తం అప్లై చేసి కొన్ని నిమిషాలు వేళ్ళతో మెత్తగా మసాజ్ చేయాలి. వారానికి రెండుసార్లు చేయండి. ఇది గొప్ప యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్.

Children-Social Media: పలు అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు.. భారత్‌లో సోషల్ మీడియాకు బానిసగా మారుతున్న 10ఏళ్ల లోపు పిల్లలు

Skin Care Tips at Home: మెరిసే చర్మం కోసం అమ్మకాలం నాటి సింపుల్ ఎఫెక్టివ్ చిట్కా.. రైస్, మిల్క్ సీరం తయారీ

Work From Hotel: వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా..?? ఈ ప్యాకేజీ మీకోసమే..!! వీడియో