AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips at Home: మెరిసే చర్మం కోసం అమ్మకాలం నాటి సింపుల్ ఎఫెక్టివ్ చిట్కా.. రైస్, మిల్క్ సీరం తయారీ

Skin Care Tips: వాతావరణంలోని కాలుష్యం, మన తినే ఆహారం. వేళాపాళాలేని ఉద్యోగ సమయం, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం చర్మం పై..

Skin Care Tips at Home: మెరిసే చర్మం కోసం అమ్మకాలం నాటి సింపుల్ ఎఫెక్టివ్ చిట్కా.. రైస్, మిల్క్ సీరం తయారీ
Rice Serum Making
Surya Kala
|

Updated on: Jul 25, 2021 | 7:56 PM

Share

Skin Care Tips: వాతావరణంలోని కాలుష్యం, మన తినే ఆహారం. వేళాపాళాలేని ఉద్యోగ సమయం, మానసిక ఒత్తిడి ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం చర్మం పై అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు , చర్మం కాంతిని సున్నితతత్వాన్ని కోల్పోవడం వంటి ప్రాబ్లమ్స్ ను ఇటీవల జనరేషన్ లో ఎక్కువమంది ఎదుర్కొంటున్నారు. చాలామంది స్కిన్ కేస్ కోసం రసాయనాలతో కూడిన సన్ స్క్రీన్ లోషన్ , వింటర్ స్క్రీన్ లోషన్ అంటూ రకరకాల లోషన్స్ ను ఉపయోగిస్తున్నారు.. అవి ఉపయోగించడం ఎక్కువ అయ్యేకొద్దీ.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చర్మాన్ని ప్రకాశ వంతంగా చేసే మన అమ్మమ్మ కాలం నాటి సింపుల్ చిట్కా రైస్ – మిల్క్ సీరం తయారీ గురించి తెలుసుకుందాం..

 కావలసిన పదార్ధాలు:

బియ్యం: రెండు టేబుల్ స్పూన్లు పాలు -ఒక స్పూన్ అలోవేరా- గుజ్జు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్- ఒక స్పూన్ నీళ్ళు- ఒక కప్పు ఆలివ్ ఆయిల్-అర స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరి నూనె -అర స్పూన్ గ్లిజరిన్- అర స్పూన్

తయారుచేసే విధానం :

ఒక గిన్నె లో బియ్యం తీసుకుని అందులో నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టండి. మర్నాడు ఆ బియ్యాన్ని నీటితో మరగనివ్వాలి. కొంచెం సేపటి తర్వాత అందులో పాలు పోసి.. స్విమ్ లో పెట్టి మరగనివ్వండి.. బియ్యం, పాలు మిశ్రమంలో అలోవేరా జెల్ అందులో వేసి మిక్స్ చేయండి. ఒక 15 నిముషాలు ఈ మిశ్రమాన్ని మరిగించిన తర్వాత ఫిల్టర్ చేసి ఒక చిన్న గాజు కంటైనర్ లోకి తీసుకోండి. ఇలా ఫీలర్ చేసిన మిశ్రమంలో రోజ్ వాటర్ ఒక టీస్పూన్, అర టీస్పూన్ కొబ్బరి నూనె, అర టీస్పూన్ ఆలివ్ ఆయిల్, అర టీస్పూన్ గ్లిజరిన్ వేసి మిక్స్ చేయండి. చివరిగా టీస్పూన్ అలోవేరా జెల్ వేసి బాగా మిక్స్ చేయండి. అంతే రైస్ – మిల్క్ సీరం రెడీ. ఈ స్కిన్ లోషన్ ను మూడు రోజుల పాటు నార్మల్ గా నిల్వ చేసుకోవచ్చు.. అదే ఫీడ్జ్ లో అయితే ఒక వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.

ఈ రైస్ సీరం లో ఉపయోగించిన పదార్ధాలు మీ చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతాయి. ఆక్నే సమస్యతో బాధపడేవారికి మంచి సహాయకారి. చర్మంలోని కొల్లాజన్ స్థాయిల పెంచడమే కాదు.. చర్మంలోని ముడతలను అడ్డుకుంటుంది. దీనిలో ఉండే సన్ స్క్రీన్ గుణాలు యాంటీ ఏజింగ్ వలె పనిచేస్తాయి. ఈ సీరం ఎటువంటి చర్మానికైనా సరిపోతుంది. నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్, అసాధారణ స్కిన్ టోన్ తొలగించడంలో కూడా సహాయపడుతుంది. వేసవి నుంచి రక్షణ కలిపిస్తుంది.

Also Read: Actor Karthik Ratnam: ఒక్క ఛాన్స్.. ఆ హీరో తో ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న నారప్ప తనయుడు