VIRAL PHOTOS : ప్రపంచంలోని ఈ 5 ప్రమాదకర స్థలాల్లో ప్రజలు నివసిస్తున్నారు..! ఏంటో తెలుసుకోండి..
uppula Raju |
Updated on: Jul 26, 2021 | 10:52 AM
VIRAL PHOTOS : ప్రపంచంలోని ఈ 5 ప్రమాదకర స్థలాల్లో ప్రజలు నివసిస్తున్నారు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
Jul 26, 2021 | 10:52 AM
కప్పడోసియా: పురాతన టర్కీలోని అనటోలియా ప్రావిన్స్‌లో ఉన్న ఈ అందమైన ప్రదేశం మానవుల పురాతన స్థావరాలలో ఒకటిగా పరిగణిస్తున్నారు. క్రీస్తుపూర్వం 6 వ శతాబ్దం నాటి రికార్డులు ఇది జొరాస్ట్రియన్ సామ్రాజ్యం పురాతన ప్రావిన్స్ అని చూపిస్తుంది. ఈ ప్రదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో చేర్చారు.
1 / 5
పోంటే వెచియో: ఇటలీలోని ఫైర్‌డే నగరంలో ఒక వంతెన ఉంది. దీనిని ఓల్డ్ బ్రిడ్జ్ అంటారు. ఆర్నో నదిపై ఉన్న ఈ వంతెన 1345 లో నిర్మించారు. కాలినడకన నదిని దాటడానికి ఉద్దేశించిన రెండు వంతెనలు వరదలో ధ్వంసమయ్యాయి. కొంతకాలం తరువాత ఈ వంతెనపై ఇళ్ళు, దుకాణాలు వెలసాయి. కాలక్రమేణా ఇవి పెరుగుతున్నాయి.
2 / 5
అల్ హజ్రా: ఈ గోడల నగరం యెమెన్ లోని హరాజ్ పర్వతాలపై ఎత్తులో ఉంది. దీనిని ప్రపంచంలో అల్ హజ్రా అని పిలుస్తారు. ఇక్కడ, గోడల వలె కనిపించే అనేక అంతస్తుల ఇళ్ళు పునర్నిర్మించారు.
3 / 5
రోసానౌ మొనాస్టరీ: ఈ రోసానౌ మొనాస్టరీ (మఠం) గ్రీస్‌లోని థెస్సాలీ ప్రాంతంలోని స్తంభాల కొండపై ఉంది. ఇది 1545 సంవత్సరంలో పునర్నిర్మించారు. 1800 చెక్క వంతెన నిర్మించడంతో ఇక్కడికి చేరుకోవడం సులభతరమైంది. రోసానౌ మొనాస్టరీ 1988 నుంచి సన్యాసినుల చిన్న సమూహానికి నిలయంగా మారింది.
4 / 5
సీఫోర్ట్: ఈ ప్రదేశం చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే దీనిపై ఏ దేశానికి హక్కు లేదు. సీలాండ్‌లో నిర్మించిన ఈ సీఫోర్ట్ గ్రేట్ బ్రిటన్ ద్వీపానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతకుముందు సీలాండ్‌కు సొంత పాస్‌పోర్ట్, కరెన్సీ ఉండేవి.