Whiskey Scotch: ఇంపోర్టెడ్ విస్కీ, స్కాచ్ తాగేవారికి గమనిక.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించింది..
Whiskey Scotch: మద్యం ప్రియులకు శుభవార్త. మహారాష్ట్రలో ఇప్పుడు ఇంపోర్టెడ్ విస్కీ, స్కాచ్ ధరలు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని 50 శాతం తగ్గించింది.

Whiskey Scotch: మద్యం ప్రియులకు శుభవార్త. మహారాష్ట్రలో ఇప్పుడు ఇంపోర్టెడ్ విస్కీ, స్కాచ్ ధరలు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని 50 శాతం తగ్గించింది. విస్కీపై ఎక్సైజ్ సుంకం తయారీ వ్యయంలో 300 నుంచి150 శాతానికి తగ్గించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. ఇంపోర్టెడ్ స్కాచ్ అమ్మకం ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.100 కోట్ల ఆదాయం వస్తోందని అంచనా. ఈ విస్కీపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం వల్ల ప్రభుత్వ ఆదాయం రూ.250 కోట్లకు పెరుగుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఈ తగ్గింపు తర్వాత విస్కీ విక్రయం లక్ష బాటిళ్ల నుంచి 2.5 లక్షల బాటిళ్లకు పెరుగుతుందని ఒక అంచనా.
స్కాచ్ స్మగ్లింగ్‌కి చెక్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి స్కాచ్‌ల అక్రమ రవాణా, కల్తీ మద్యం విక్రయాలు అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా మహారాష్ట్రలో దిగుమతి చేసుకున్న విస్కీ ధరలు భారీగా తగ్గాయి. దీంతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. వార్తల ప్రకారం ప్రస్తుతం రోజుకు 1 లక్ష సీసాలు అమ్ముడవుతున్నాయి. తగ్గిన సుంకం కారణంగా బాటిళ్ల అమ్మకం 2.5 లక్షలకు చేరుకుంటుంది.
మద్యం ద్వారానే ఎక్కువ ఆదాయం మహారాష్ట్రతో సహా మొత్తం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం ద్వారా అత్యధిక ఆదాయం వస్తుందన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో దిగుమతి చేసుకున్న విస్కీ ధరలను తగ్గించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 50 శాతం తగ్గించింది. దీంతో విస్కీ ధర భారీగా తగ్గింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలు తక్కువ ధరకు ఇంపోర్టెడ్ స్కాచ్‌ని పొందుతారు.