1st May 2022: గ్యాస్ సిలిండర్ల నుంచి UPI వరకు.. నేటి నుంచి కీలక మార్పులు.. అవేంటంటే?

నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మాదిరిగానే, మే నెలలో కొన్ని నిబంధనలు మారనున్నాయి. గ్యాస్ సిలిండర్ల నుంచి టోల్ ట్యాక్స్, UPIలో పలు కీలక మార్పులు జరగనున్నాయి.

1st May 2022: గ్యాస్ సిలిండర్ల నుంచి UPI వరకు.. నేటి నుంచి కీలక మార్పులు.. అవేంటంటే?
Follow us
Venkata Chari

|

Updated on: May 01, 2022 | 6:40 AM

Rules Changing From 1st May: నేటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. ప్రతి నెలలాగే మే నెల తొలి రోజు నుంచి కొన్ని నిబంధనలు మారనున్నాయి. గ్యాస్ సిలిండర్ల నుంచి టోల్ ట్యాక్స్, UPI వరకు అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కాకుండా, నెల ప్రారంభంలో బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. లక్నో నుంచి ఘాజీపూర్ వెళ్లే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కేంద్ర ప్రభుత్వం నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయనున్నారు.1వ తేదీ నుంచి టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు. ఇది 340 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. ఇక నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రయాణించే వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. అంటే వారి ప్రయాణం ఖరీదైనది. టోల్ టాక్స్ వసూలు రేటు కిలోమీటరుకు రూ. 2.45 ఉంటుంది.

గ్యాస్ సిలిండర్లు ఖరీదైనవి కావొచ్చు..

ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్షిస్తాయి. మే 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించి, ధరలను పెంచాలా లేదా తగ్గించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. గత నెలలో గ్యాస్ సిలిండర్ ధరలను రూ.50 పెంచారు. ఈసారి కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

యూపీఐ ద్వారా ఐపీవోలో పెట్టుబడి నిబంధనల్లో..

మీరు IPOలో పెట్టుబడి పెడితే, మీ కోసం ఒక ముఖ్యమైన వార్త ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు UPI ద్వారా IPOలో ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మే 1 నుంచి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటి వరకు రిటైల్ ఇన్వెస్టర్లు UPI ద్వారా IPOలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చని తెలిసిందే. అయితే మే 1 నుంచి దాని పరిమితిని రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.

బ్యాంకులు వరుసగా సెలవులు..

మే ప్రారంభంలో, వరుసగా 3 రోజులు బ్యాంకులు పనిచేయవు. మే నెల ప్రారంభంలో అంటే 1, 2, 3 తేదీల్లో చాలా నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఇది కాకుండా, మే నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మే 1న కార్మిక దినోత్సవం, ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇది కాకుండా, పరశురామ జయంతి మే 2న కొన్నిచోట్ల, ఈద్ కారణంగా మే 3 న చాలా నగరాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ED on Xiaomi: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీకి ఈడీ భారీ షాక్.. రూ.5,551 కోట్ల జియోమీ ఆస్తుల సీజ్

Real Estate: బూమ్ లో దేశీయ రియల్టీ సెక్టార్.. కొత్త ఇళ్లకు భారీగా డిమాండ్.. ఎందుకంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!