No vaccine No Liquor : మందుబాబులకు షాకింగ్ న్యూస్..! వ్యాక్సిన్ వేసుకుంటేనే లిక్కర్..? కొత్త నిబంధనల జారీ
No vaccine No Liquor : ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ విధిస్తూ
No vaccine No Liquor : ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ విధిస్తూ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. అయినప్పటికీ వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామంది ముందుకు రావడంలేదు. దీంతో కొన్నిరోజుల క్రితం వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వాలు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉచిత ఆఫర్లను కూడా ప్రకటించాయి. కొంతమంది బీరు ఫ్రీ అంటే మరికొంతమంది ఫుడ్ ఫ్రీ అంటూ ప్రచారం చేశారు. అయినా కూడా చాలామంది ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదు. అయితే వ్యాక్సిన్‌పై చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మందుబాబుల గురించే. వ్యాక్సిన్ వేసుకుంటే మద్యం తాగకూడదని ఇంట్లో వారు చెప్పడంతో చాలామంది వ్యాక్సిన్ వేసుకోవడం లేదు. దీంతో కరోనా వచ్చిన మందుబాబులు విచ్చల విడిగా తిరుగుతూ చాలామందికి వ్యాపింపజేస్తూ కొత్త కేసులకు కారణమవుతున్నారు. ఇది గమనించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిబంధనలను జారీ చేసింది. టీకా తీసుకోకుంటే ఇక్కడ లిక్కర్ ఇవ్వరు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటావా జిల్లా యంత్రాంగం మొదటగా ఈ రూల్ తెచ్చింది. లిక్కర్ షాపులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే మందు అమ్మాలని లిక్కర్ షాపు యజమానులకు అధికారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు అన్ని లిక్కర్ షాపుల బయట పోస్టర్లు అతికించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లిక్కర్ అమ్ముతామని అందులో ఉంది.
ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి మాత్రమే లిక్కర్ అమ్మాలని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మాకు ఆదేశాలు ఇచ్చారు అని లిక్కర్ షాపుల యజమానులు తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 13వేల 777 కరోనా కేసులు నమోదయ్యాయి. 279మంది కరోనాకు బలయ్యారు. 13వేల 200మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఛత్తీస్ గఢ్ లో సైతం ఇలాంటి రూల్ ఒకటి తెచ్చారు. వ్యాక్సిన్ తీసుకోని సిబ్బందికి జీతం ఇచ్చేది లేదని అధికారులు చెప్పారు.