AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army: చెమట కూడా గడ్డకట్టే తీవ్రమైన చలిలో భారత సైనికులు ఎలా జీవిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Indian Army: భారత సైన్యం కృషి అంతా ఇంతా కాదు. వారు దేశానికి ఎంత కష్టపడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశ ప్రజల కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు..

Indian Army: చెమట కూడా గడ్డకట్టే తీవ్రమైన చలిలో భారత సైనికులు ఎలా జీవిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Subhash Goud
|

Updated on: Nov 21, 2021 | 9:50 PM

Share

Indian Army: భారత సైన్యం కృషి అంతా ఇంతా కాదు. వారు దేశానికి ఎంత కష్టపడుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దేశ ప్రజల కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. ఈ సైనికులు మైనస్ ఉష్ణోగ్రత ఉన్న సియాచిన్‌లో కష్ట సమయాల్లో ఉంటూ దేశానికి సేవలందిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో సైనికులు అక్కడ ఎలా నివసిస్తున్నారు.. ఆ చలిలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందో తెలుసుకుందాం.

సియాచిన్ లాంటి ప్రాంతంలో మన సైనికులు 20 వేల అడుగుల ఎత్తులో పగలు రాత్రి నిలబడి ఉంటారు. గత కొన్నేళ్లుగా వాతావరణం కారణంగా ఎందరో సైనికులు తమ ప్రాణాలను బలిగొన్నారు. బేస్ క్యాంప్ నుండి సైనికులు అత్యంత కష్టతరమైన దూరాన్ని అధిగమించాల్సి ఉంటుంది. దీని కోసం సైనికులు కలిసి నడుస్తారు. అలాగే లోతైన లోయలో ఎవరూ జారి పడకుండా సైనికులందరి పాదాలను తాడుతో కట్టివేస్తారు.

పెట్రోలింగ్ బృందం ఉదయం 8-9 గంటలకు శిఖరానికి చేరుకోవడానికి బేస్ క్యాంప్ నుండి బయలుదేరాల్సి ఉంటుంది. సైనికులు కొన్ని కిలోల బరువున్న బ్యాగును మోస్తూ ఎత్తైన దుర్గమ ప్రాంతంకు చేరుకుంటారు. సైనికుల శరీరంపై అనేక పొరలతో కూడిన దుస్తులను వేసుకుంటారు.

ఇలా సైనికులు చేరుకునేసరికి వారి చెమటతో తడిసి ముద్దయిపోవడం, చలి మైనస్‌కు చేరుకోవడంతో శరీరంపై కూడా చెమట పేరుకుపోయే పరిస్థితి ఉంటుంది. మైనస్ 60 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో తినడం, నీళ్లు తాగడం కూడా కష్టతరమవుతుంది. సైనికులకు క్యాన్లలో లేదా టిన్ క్యాన్డ్ కంటైనర్లలో ప్యాక్ చేసిన ఆహారాన్ని అందిస్తారు.

ఇది ఎక్కువగా ద్రవాన్ని కలిగి ఉంటుంది. ఇది తినడానికి లేదా గడ్డ కట్టడానికి ముందు నిప్పు మీద కరిగించుకుంటారు. ఈ ఇబ్బందులను ఎదుర్కొవడానికి జవాన్లకు డ్రై ఫ్రూట్స్ ఇస్తారు. తాగునీటి సమస్య ఉండడంతో ఐస్‌ను కరిగించి తాగాల్సి వస్తుంటుంది.

మరుగుదొడ్డికి ఉపయోగించే నీరు కూడా కరగకుండా ఎప్పుడూ స్టవ్‌పైనే ఉంచుతారు. తీవ్రమైన చలి మరియు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆ ప్రభావం నిద్రపై పడుతుంది. యువతకు సరైన నిద్ర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ దేశం కోసం పాటుపడే జవాన్లను ఎంత పొగిడినా తక్కువే.

ఇవి కూడా చదవండి:

Jan Dhan Accounts: ఖాతాదారులకు ఎస్‌బీఐ షాక్‌.. పొరపాటున వసూలు చేసిన రూ.254 కోట్లు.. బ్యాంకుపై ఫిర్యాదు..!

Assets Auction: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎమ్‌టీఎన్‌ఎల్‌ ఆస్తుల వేలం..!