AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamun Farming: ఈ పంట సాగు చేస్తే ధనవంతులవ్వడం ఖాయం.. ఒక హెక్టారుకి రూ. 20 లక్షల ఆదాయం

మామిడి, జామ కంటే నెరేడు పండ్లు కొంచెం ఖరీదు ఎక్కువ కావడానికి  కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో  రైతు సోదరులు నేరేడు పండ్లను పండిస్తే , జామ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. దీంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఈ నేరేడు చెట్ల పెంపకానికి సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాయి. 

Jamun Farming:  ఈ పంట సాగు చేస్తే ధనవంతులవ్వడం ఖాయం.. ఒక హెక్టారుకి రూ. 20 లక్షల ఆదాయం
Jamun Farming
Surya Kala
|

Updated on: Jun 11, 2023 | 12:31 PM

Share

సీజనల్ గా దొరికే నేరేడు పండు ఔషదాల గని. నేరేడు పండుని అందరూ ఇష్టపడతారు. ఇది యాంటీ ఆక్సిడెంట్ పండు. దీనిని తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు నేరేడు పండుని తినడం వలన ఎముకలు దృఢమవుతాయని చెబుతారు. మామిడి, జామ కంటే నెరేడు పండ్లు కొంచెం ఖరీదు ఎక్కువ కావడానికి  కారణం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో  రైతు సోదరులు నేరేడు పండ్లను పండిస్తే , జామ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. దీంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఈ నేరేడు చెట్ల పెంపకానికి సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నాయి.

ప్రస్తుతం బీహార్ ప్రభుత్వం ఈ నేరేడు సాగు ప్రారంభించే రైతులకు సబ్సిడీ ఇస్తోంది. బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో నేరేడుతో సహా అనేక పంటల విస్తీర్ణాన్ని పెంచాలని కోరుకుంటోంది. దీంతో ముఖ్యమంత్రి హార్టికల్చర్ మిషన్ , నేషనల్ హార్టికల్చర్ మిషన్ పథకం కింద రైతులకు 50 శాతం సబ్సిడీ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు.

నేరేడు పొలంలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి.. 

ఇవి కూడా చదవండి

నేరేడు ఒక ఔషధ పండు. ఈ నేరేడు పండ్లను ఉపయోగించి అనేక రకాల ఔషధాలను కూడా తయారు చేస్తారు. విశేషమేమిటంటే మామిడి, లిచ్చి, జామ వంటి వీటిని కూడా పండిస్తారు. మొదటి పొలాన్ని దున్నుతారు. తరువాత నాగలిని ఉపయోగించి పొలాన్ని చదును చేస్తారు. భూసారం పెంచడానికి పొలంలో ఆవు పేడను సేంద్రీయ ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. తర్వాత నేరేడు మొక్కలను సమాన దూరంలో నాటుకోవాలి. పొలంలో మంచి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి.

ఒక హెక్టారులో 250 నేరేడు మొక్కలు 

నేరేడు మొక్కలు నాటిన తర్వాత 4 నుండి 5 సంవత్సరాల్లో కాపుకు వస్తాయి. అయితే 8 సంవత్సరాల తర్వాత మొక్కలు పూర్తిగా చెట్ల రూపాన్ని సంతరించుకుంటాయి. అప్పటి నుంచి నేరేడు పండ్లు అధిక మొత్తంలో  ఉత్పత్తి పెరుగుతుంది. అంటే 8 సంవత్సరాల తర్వాత నేరేడు చెట్టు నుండి 80 నుండి 90 కిలోల పండ్లను దిగుమతి అవుతాయి. ఒక హెక్టారులో 250 కంటే ఎక్కువ నేరేడు మొక్కలను పెంచుకోవచ్చు. ఇలా చేయడం వలన 8 సంవత్సరాల తర్వాత పూర్తీ స్తాయిలో 250 జామున్ చెట్ల నుండి 20000 కిలోల వరకు పండ్లు దిగుమతి అవుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో నేరేడు పండ్లను కిలో రూ.140కి విక్రయిస్తున్నారు. ఈ విధంగా    ఒక హెక్టారులో పండించిన నేరేడు పండ్లను విక్రయించిన అనంతరం 20 లక్షల రూపాయలకు పైగా సంపాదించవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..