AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jacu Bird Coffee: పక్షి రెట్టలతో కాఫీ.. టేస్ట్‌లో ఎవరెస్ట్.. ఈ కాఫీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ మీ కోసం

మనం సాధారణంగా కాఫీ లేదా టీ ప్రిపేర్‌ చేయాలంటే టీ పౌడర్‌, పాలను ఉపయోగిస్తాం. లేక అల్లం, గ్రీన్ టీ అని చాలా రకాల టీలు ఉంటాయి. వాటిని తాగడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చాలామంది..

Jacu Bird Coffee: పక్షి రెట్టలతో కాఫీ.. టేస్ట్‌లో ఎవరెస్ట్.. ఈ కాఫీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ మీ కోసం
Ram Naramaneni
|

Updated on: Feb 17, 2021 | 10:29 AM

Share

మనం సాధారణంగా కాఫీ లేదా టీ ప్రిపేర్‌ చేయాలంటే టీ పౌడర్‌, పాలను ఉపయోగిస్తాం. లేక అల్లం, గ్రీన్ టీ అని చాలా రకాల టీలు ఉంటాయి. వాటిని తాగడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చాలామంది అంటుంటారు. అయితే ఓ దేశంలో పక్షి రెట్టలతో కాఫీ తాయారు చేస్తున్నారు. అవును మీరు విన్నది అక్షరాల నిజం. పక్షులు విసర్జించే మలంతోనే అక్కడ రుచికరమైన కాఫీని తయారు చేస్తున్నారు. మనకి వినడానికి వికారంగా అనిపించినా నిజంగానే అక్కడ పక్షుల రెట్టలతో కాఫి పెడతారట. ఇంతకీ ఏం పక్షి అనుకుంటున్నారా… ఆ పక్షి పేరు జాకు బర్డ్. ఈ పక్షుల వల్ల ఆ కాఫీ ఎస్టేట్‌కు గొప్ప పేరు వచ్చేసింది. ఇంతకీ ఆ సక్సెస్‌ఫుల్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

కామోసిమ్ ఎస్టేట్‌ను‌ బ్రెజిల్‌లోనే అత్యంత చిన్న కాఫీ ప్లాంటేషన్ అని అటుంటారు. 50 హెక్టార్లలో మాత్రమే కాఫీ తోటల వల్ల ఉత్పత్తి తక్కువగానే ఉండవచ్చు. కానీ, ఆదాయం మాత్రం వారెవ్వా అనిపిస్తుంది. ఎందుకో తెల్సా.. అక్కడి తోటల్లో జాకు బర్డ్స్ ఉన్నాయి‌. ఈ పక్షుల వల్ల ఎస్టేట్‌కు ఓ రేంజ్‌లో పేరు, ప్రఖ్యాతలు వచ్చాయి. అదెలా అనుకుంటున్నారా.?! 2000 సంవత్సరంలో ఆ కాఫీ ఎస్టేట్ యజమానికి వచ్చిన చిన్న ఆలోచనే ఇప్పుడు ఓ రేంజ్‌లో ఆదాయాన్ని రాబడుతోంది.

అసలు విషయమేంటంటే..ఎస్టేట్‌ యజమాని ఓ రోజు నిద్రలేచి చూసేసరికి.. జాకు పక్షులు మొత్తం కాఫీ మొక్కలకు వచ్చే గింజలను నాశనం చేస్తూ కనిపించాయి. అయితే ఆ పక్షులపై ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి లేదు.  బ్రెజిల్‌ లో ఉన్న పక్షి జాతుల్లో జాకు పక్షి స్పెషల్ కాబట్టి. దీంతో అతడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఈ క్రమంలో తన ఆలోచనలకు పదును పెట్టగా.. జాకు పక్షి రెట్టలతో కాఫీ ఎందుకు తయారు చేయకూడదనే థాట్ వచ్చింది. వెంటనే కూలీలను పిలిచి జాకు పక్షుల రెట్టలను సేకరించమని ఆర్డర్ వేశారు. ఆ రెట్టల్లో ఉండే కాఫీ బీన్స్‌ ను వేరు చేసి. వాటిలోని పోషకాలు, రుచికి నష్టం లేకుండా క్లీన్ చేశాడు. అనంతరం ఆ గింజలతో కాఫీ తయారు చేసి టేస్ట్ చేశాడు. అది రెగ్యులర్‌ కాఫీలకంటే.. నెక్ట్స్ లెవల్ టేస్ట్ ఉంది.

మరో ఇంట్రెస్టింగ్‌ విషయమేంటంటే ఆ పక్షుల కడుపులో విడుదలయ్యే యాసిడ్ల వల్ల ఆ కాఫీ గింజలు రోస్ట్ అవుతాయట. ఫలితంగా వాటికి సాధారణ గింజలు కంటే ఎక్కువ రుచి లభిస్తుందని ఎస్టేట్‌ యజమాని తెలిపారు. ఈ ఆలోచన వల్ల ఆ ఎస్టేట్ కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీల సరసన నిలిచింది. ఒక కిలో జాకు పక్షి రెట్టల ధర వెయ్యి డాలర్లు అంటే అక్షరాల రూ.72,659 పలుకుతుందంటే.. ఆ కాఫీకి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలా..!

Also Read:

Memes on petrol price: సెంచరీ కొట్టిన పెట్రోల్.. నెటిజన్ల ఫన్నీ మీమ్స్ చూస్తే నవ్వాపుకోలేరు..

Today Horoscope: ఫిబ్రవరి 17 రాశి ఫలాలు.. ఆ రాశి వారికి బాకీలు వసూలు అవుతాయి.. వివాదాలు పరిష్కారం అవుతాయి