AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Horoscope: ఫిబ్రవరి 17 రాశి ఫలాలు.. ఆ రాశి వారికి బాకీలు వసూలు అవుతాయి.. వివాదాలు పరిష్కారం అవుతాయి

ఈ రోజు అంటే ఫిబ్రవరి 17 బుధవారం పలు రాశుల వారికి మంచి జరిగే అవకాశాలున్నాయి. అరోగ్యం, వివాదాల విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని జ్యోతిష శస్త్ర ..

Today Horoscope: ఫిబ్రవరి 17 రాశి ఫలాలు.. ఆ రాశి వారికి బాకీలు వసూలు అవుతాయి.. వివాదాలు పరిష్కారం అవుతాయి
Subhash Goud
|

Updated on: Feb 17, 2021 | 8:59 AM

Share

ఈ రోజు అంటే ఫిబ్రవరి 17 బుధవారం పలు రాశుల వారికి మంచి జరిగే అవకాశాలున్నాయి. అరోగ్యం, వివాదాల విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని జ్యోతిష శస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ రోజు వివిధ రాశుల వారు మంచి ఫలితాలు సాధించేందుకు కొన్ని జాగ్రత్తలు వహిస్తూ ముందుకెళ్లడం ఎంతో మంచిది. ఈ రోజు రాశిఫలాల్లో ఎవరికి ఎలా ఉందో చూద్దాం..

మేష రాశి:

మేష రాశి వారికి ఈ రోజు కొత్తగా అప్పులు చేస్తారు. అయినా జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. దూర ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణాల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు హనుమాన్‌ చాలిసా పారాయణం మేలు చేస్తుంది.

వృషభ రాశి:

ఈ రాశివారు వస్త్రా లాభాలు పొందుతారు. వివాదాల నుంచి బయటపడే అవకాశాలుంటాయి. ఈ రాశివారు ఈ రోజు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలుంటాయి. పేద వారికి వస్త్రాధానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.

మిథున రాశి:

ఈ రాశివారికి ఈ రోజు మంచి జరుగుతుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడుతుంటాయి. ఈ రాశి వారు శ్రీవేంకటేశ్వర స్వామికి పులిహోరతో నివేదించడం ఎంతో మంచిది.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే దిశగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మంచి వార్తలు వింటారు. ఈ రాశి వారు నవధాన్యాలు మంచి నీటితో పరమేశ్వరునికి సమర్పించడం ఎంతో మంచిది.

సింహ రాశి:

సింహ రాశి వారు ఈ రోజు స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గురువుల ఆశీర్వచనాలు ఎంతో మేలు చేస్తుంది.

కన్య రాశి:

కన్య రాశి వారు పలు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యవహారిక విషయాలు సాఫిగా సాగుతాయి. ఆస్తి లాభాలు పొందుతారు. అలాగే మంచి సూచనలు పొందుతారు. ఈ రోజు ఈ రాశివారు మందార పుష్పాలతో సుబ్రమణ్య స్వామికి నివేదించడం ఎంతో మంచిది.

తుల రాశి:

ఈ రాశి వారు సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రాశివారు సమస్యల విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ఈ రాశివారు మహాలక్ష్మీ అమ్మవారికి తెలుపు రంగులో ఉన్న పుష్పాలను సమర్పించడం మంచిది.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి భూ సంబంధిత విషయాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రోజు చేసే పనుల్లో కొంత జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఈ రాశి వారికి విష్ణు సహస్రనామం వల్ల మేలు చేసే అవకాశాలున్నాయి.

ధనుస్సు రాశి:

ఈ రాశి వారికి కుటుంబంలో కొద్దిపాటిగా సమస్యలు కనిపిస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నాలు చేస్తుండాలి. ఈ రాశి వారు తులసి దళాలతో పూజలు చేసుకోవడం మంచిది.

మకర రాశి:

మకర రాశి వారు కుటుంబపరమైన కార్యక్రమాలను పూర్తి చేస్తుంటారు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పేద వారికి కూరగాయలు ధానం చేయడం మంచిది.

కుంభ రాశి:

కుంభరాశి వారు సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాల్లో మంచి ఆలోచనతో ముందుకెళ్తుంటారు. ఈ రాశి వారికి దుర్గ ఆరాధన ఎంతో మేలు చేస్తుంటుంది.

మీన రాశి:

మీన రాశి వారికి వ్యవహారిక కార్యక్రమాల్లో కొంత ఆలస్యం అవుతుంటుంది. ప్రతి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందర పడి ఎలాంటి విషయాల్లోనైనా కుదుర్చుకోవడం మంచిది కాదు. ఈ రోజు చేసే పనుల్లో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. మరిన్ని ఫలితాల కోసం ఆ రాశి వారు పరమేశ్వరునికి పంచామృతాభిషేకం చేయడం మంచిది.

Follow Us
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..